పెళ్లి తర్వాత భార్యాభర్తలు సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం. భార్యాభర్తలు గొడవ పడినప్పుడు కొన్ని టిప్స్ ని పాటిస్తే క్షణాల్లో గొడవ సర్దుకుంటుంది. మరి భార్య, భర్తలు గొడవలు రాకుండా ఉండడానికి.. గొడవ వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. గొడవ అనేది చిన్నగా మొదలవుతుంది. కాసేపు తర్వాత పెద్దదిగా మారుతుంది. ఏదైనా గొడవ మొదలైనప్పుడు 5 సెకండ్ల పాటు విశ్రాంతి తీసుకోండి. ఇలా చేస్తే గొడవ సర్దుకుంటుంది. గొడవ పెద్దది అవ్వదు.
Advertisement
గొడవ పెద్దది అవ్వకుండా ఉండాలన్నా, పరిష్కారం అవ్వాలన్నా ఫీలింగ్స్ చాలా ముఖ్యం. అయిదు నిమిషాల పాటు ఆగి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అలాగే కోపంతో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం చల్లారే వరకు ఆగండి. అలాగే అనవసరమైన విషయాలని భార్యాభర్తలు పట్టించుకోకూడదు. అనవసరమైన విషయాల గురించి భార్యాభర్తలు ఆలోచించడం కూడా మంచిది కాదు.
Advertisement
Also read:
ఐదు సెకండ్లు మీరు గ్యాప్ ఇచ్చినట్లయితే గొడవ సర్దుకుంటుంది. మాటలు కూడా అదుపులో ఉంటాయి. అనవసరంగా ఏమీ అనకుండా ఉంటారు. అలాగే గొడవ పడినప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం గొడవ పడినప్పుడు మనదే పై చేయి అయ్యి ఉండాలి అని భార్యాభర్తలు అనుకోకూడదు. ఎదుటి వాళ్ళ సమస్య, వాళ్ళ మాటలకి కూడా విలువని ఇలా చేస్తే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!