అమావాస్యకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ నెలా కృష్ణపక్షం చతుర్థి తిధి తర్వాత అమావాస్య వస్తుంది. మత విశ్వాసాల ప్రకారం అమావాస్యకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అమావాస్య నాడు గంగా స్నానాన్ని ఆచరిస్తే మహా విష్ణువుని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందట. అమావాస్య నాడు లక్ష్మీ దేవిని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకని అమావాస్య నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ఆరాధించాలి.
Advertisement
అమావాస్యకు ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. పూర్వికుల అనుగ్రహాన్ని పొందాలంటే అమావాస్య నాడు తర్పణాలు ఇచ్చే ఆచారాన్ని పాటించాలి. ప్రతి నెల అమావాస్యకి ఇలా చేస్తూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకి ఇలా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
Also read:
Advertisement
Also read:
డిసెంబర్ ఒకటవ తేదీన అమావాస్య వచ్చింది. మతపరంగా విశేషమైన ప్రయోజనాలను ఇది కలిగిస్తుంది కార్తీకమాసం నుండి కొన్ని పనులు చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అమావాస్య నాడు లక్ష్మీ దేవిని ఆరాధించాలి. కార్తీక మాస అమావాస్య రోజు ఉదయాన్నే నిద్ర లేచి నది స్నానం చేయాలి. ఆ తర్వాత దేవాలయానికి వెళ్లాలి. లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.