నగరి నియోజకవర్గంలో ప్రతి మండలంలో రోజాకు వ్యతిరేక వర్గం వుంది. రోజాకు టికెట్ కూడా ఇవ్వద్దని అన్నారు. జగన్ మాత్రం రోజాకు టికెట్ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిపోయాయి. అయితే ఇప్పుడు ఏ పార్టీ నెగ్గుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. రోజా ముందే చేతులు ఎత్తేసారు. ఓటమికి సాకులు వెతుక్కున్నారా..? దీనిలో భాగంగానే సొంత పార్టీ నేతల మీద ఆరోపణలు చేస్తున్నారా అంటే అవునని తెలుస్తోంది. పోలింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రోజా సొంత పార్టీ నేతలు తనను ఓడించే ప్రయత్నం చేశారని ఆమె చెప్పారు.
Advertisement
అయితే సొంత పార్టీ నేతలు పట్టించుకోని ఆమె పోలింగ్ తర్వాత ఈ ప్రకటన చేయడం షాకింగ్ గా ఉంది. ప్రచారం వరకు అసలు వారిని పట్టించుకోని రోజా ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళ పేర్లు చెప్పింది. నగరి నియోజకవర్గంలో ఆమెకి వ్యతిరేకత ఉంది రోజాకు టికెట్ ఇవ్వొద్దన్నారు. కానీ జగన్ మాత్రం ఇచ్చారు. అసంతృప్తి నాయకులతో సర్దుబాటు చేసుకోవాలని స్వయంగా హైకమాండ్ ని సూచించిన రోజా వినలేదు.
Advertisement
వారిని లెక్క చేయలేదు జగన్ ప్రభంజనంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో గెలిచేస్తారని ధీమాగా ఉన్నారు. వాళ్ళు సహకరించకపోయినా పర్వాలేదన్న రీతిలో ఆమె ఉన్నారు. పోలింగ్ శాతం పెరిగింది. అర్ధరాత్రి వరకు ఓటర్లు బారులు తీరడంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడిందని కామెంట్లు వినపడుతున్నాయి. ఈ తరణంలో వైసీపీ నేతలు విభిన్న ప్రకటనలు చేశారు. రోజా మీడియం ముందుకి వచ్చారు పెద్దిరెడ్డి పేరు చెప్పలేదు కానీ ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో పదవులు చేపట్టిన నాయకుల పేర్లను బయటపెట్టారు. ప్రచారం చేసినప్పుడు కూడా సొంత పార్టీ నేతలను పిలవలేదు. అయితే మొత్తానికి ఈమె ఓటమిని ముందే ఒప్పుకున్నారని తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!