చాలామంది ఉదయం లేచిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు దానితో ఆరోగ్యం పాడవుతుంది. ఉదయం లేచిన తర్వాత కాఫీ, టీలు వంటివి తీసుకోవడంతో పాటుగా చాలా మంది రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో టీ కాఫీ తీసుకోవడం అసలు మంచిది కాదు శరీరంలో హార్మోన్ల సమస్య కలగొచ్చు. ఎసిడిటీ వంటి సమస్యలు కూడా రావచ్చు.
Advertisement
Advertisement
కాబట్టి అసలు టీ కాఫీలని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోకండి. అలానే కూల్డ్రింక్స్, సోడా వంటి చల్లటి పదార్థాలని కూడా అసలు తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటిని తీసుకోవడం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ ని తీసుకోవడం కూడా మంచిది కాదు. ఖాళీ కడుపుతో కారంగా ఉండే ఆహార పదార్థాలు మసాలాలు వేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు వాటి వలన గ్యాస్ ఎసిడిటీ అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. ఉదయాన్నే పెరుగు తీసుకోవడం కూడా మంచిది కాదు అసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
Also read:
- నీళ్లు సరిగ్గా తీసుకోవట్లేదా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!
- ఈ అలవాట్ల వల్లే.. యువత పాడైపోతోంది.. జాగ్రత్తగా వుండండి..!
- చాణక్య నీతి: కచ్చితంగా ఈ విషయాల్ని తెలుసుకోండి… గెలుపు మీదే..!