ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా తన జీవిత భాగస్వామితో ఉండాలని అనుకుంటారు. ఏ ఒక్కరూ కూడా గొడవలు రావాలి, విడిపోవాలని అనుకోరు. భార్య భర్త మధ్య బంధం బాగుండాలంటే కచ్చితంగా భార్యాభర్త మధ్య గొడవలు వచ్చిన తర్వాత మళ్లీ కలిసి పోవడానికి చూడాలి. ఒక్కొక్కసారి చిన్న విషయాలను కూడా సాగ తీసుకుంటూ వెళ్ళకూడదు వాటిని లైట్ తీసుకుంటూ మర్చిపోతూ ఉండాలి. అయితే ఎప్పుడు కూడా పార్ట్నర్ తో ఈ విషయాలని అసలు పంచుకోకూడదు. ఈ విషయాలను కనుక షేర్ చేసుకుంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి.
Advertisement
చాలామంది ఎదుటివారి భర్తలను చూపించి ఇలా ఉండాలి లేదంటే వాళ్ళతో పోల్చడం లాంటివి చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య ఇలా చేయకూడదు. ఇలా కనుక ఎప్పుడైనా ఎవరినైనా చూసి భార్య చెప్పినట్లయితే కచ్చితంగా భర్తకి అనుమానం అభద్రత భావన వంటివి కలుగుతాయి. కొంతమంది భర్తలోని లోపాలని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అయితే జంటలో ఇద్దరికీ కూడా ఒకే రకమైన అభిరుచులు ఉండక్కర్లేదు.
Advertisement
అది మార్చుకో ఇది మార్చుకో అని ప్రేమగా చెప్పాలి తప్ప లోపాలని ఎత్తి చూపించకూడదు. కట్టుకున్న వాడు నచ్చినా అతని తరుపు వాళ్ళందరూ కూడా నచ్చాలని ఏమీ లేదు అయితే ఒకవేళ కనుక వాళ్ళ తీరు ప్రవర్తన నచ్చకపోతే మనసులోనే పెట్టుకోండి. ప్రతిదీ మీరు మీ భర్తకి చెప్తే వ్యతిరేకంగా మారిపోవచ్చు. అలా అని ఎవరైనా హింసించినా గాయపడే మాటలన్నా, పడుతూ ఉండొద్దు. అలాంటివి బయటకి చెప్పాలి దాపరికాలు ఉండడం మంచిది కాదు. ఎప్పుడూ కూడా భార్య భర్త మధ్య నిజాయితీ ఉండాలి భార్య భర్త ఇద్దరు కూడా ఇదివరకు ప్రేమ విషయాలు ఒకరితో చెప్పకూడదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!