మనం గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఇతర ఏ వ్యాపారసంస్థల్లో కానీ వారి వారి ఇళ్ళ ముందు దిష్టిబొమ్మలు అనేది చూస్తూనే ఉంటాం. అవి పెట్టుకోవడం వలన మనకు దిష్టి తగలదు అనేసి నమ్మకంతో అవి పెట్టుకుంటారు. అసలు ఈ దిష్టిబొమ్మలు ఇంటి ముందు ఎందుకు పెడతారు, అవి పెట్టడం వల్ల లాభమా? నష్టమా? అసలు ఎలాంటి దిష్టిబొమ్మలు ఇంటి ముందు పెట్టుకోవాలో తెలుసుకుందాం.
Advertisement
చాలామంది ఇంటి ముందు పెట్టే దిష్టిబొమ్మలు అనేవి ఎర్రగా, రాక్షసుల లాగా, నాలుక మీద తేలు బొమ్మతో చూడటానికి చాలా భయంకరంగా ఉండే విధంగా దిష్టిబొమ్మలు పెడుతూ ఉంటారు. అలాగే కొత్తగా కట్టే బిల్డింగ్ ల ముందు లేదా కట్టిన బిల్డింగ్ ముందుగానీ ఇలా పెడుతూ ఉంటారు. మరి కొంత మంది వీధి పోటులకు, ఇతరత్రా వాటికి పెడుతూ ఉంటారు. అయితే ఎలాంటి దిష్టి బొమ్మలు పెడితే ఎలాంటి ఫలితం వస్తుందని చాలామంది సందేహంలో ఉంటారు.
Advertisement
సాధారణంగా ప్రతి ఇంట్లో మనం ఆరాధించే దైవం ఉంటుందని నమ్ముతాం. సాధారణంగా, ఏదైనా దేవుని ఉత్సవం జరిగేటప్పుడు ఆ ఉత్సవం ముందు ఒక దిష్టిబొమ్మను పెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఇంటి ముందు దిష్టిబొమ్మను పెడితే అలా ఉంటుందని అంటున్నారు ఆస్ట్రాలజీ నిపుణులు. వాకిట్లో శంకు చక్రాలు, నామాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇది పెట్టడం వల్ల పాజిటివ్ వైబ్స్ కలుగుతాయని, లేదా ఏదైనా భగవంతుని ఫోటో పెట్టుకోవాలని చెబుతున్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని వాకిట్లో పెట్టుకుంటే ఎటువంటి దుష్ట శిక్షణ అయినా సరే మన ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. ఈ యొక్క పంచముఖ హనుమాన్ పటాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్లైతే మనకు అన్ని లాభాలు, సుఖమైన జీవన విధానం ఆ ఇంట్లో ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.
READ ALSO : పవన్ కళ్యాణ్ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?