Home » ఫోన్ పౌచ్ లో డబ్బులు పెడుతున్నారా..? ఈ అలవాటు మానుకోండి.. ఎందుకంటే..?

ఫోన్ పౌచ్ లో డబ్బులు పెడుతున్నారా..? ఈ అలవాటు మానుకోండి.. ఎందుకంటే..?

by Sravya
Ad

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంకేమీ అక్కర్లేదు. బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ ఉంటే సరిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా కొనుగోలు చేయాలంటే ఈజీగా ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా పే చేసేస్తున్నారు. ఎలాంటి క్యాష్ కూడా తీసుకు వెళ్లట్లేదు. ఇది ఇలా ఉంటే కొంత మంది ఏం చేస్తారంటే, మొబైల్ పౌచ్ లోనే డబ్బులుని పెట్టుకుంటూ ఉంటారు. ఏవైనా అవసరమైతే ఆ డబ్బులు తీసి వాడుతూ ఉంటారు.

Advertisement

ఇక హ్యాండ్ బ్యాగ్, పర్స్, వాలెట్ వంటి వాటిని తీసుకువెళ్లక్కర్లేదు. సులభంగా ఉంటుందని చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. అలానే కొందరు ఏం చేస్తుంటారు అంటే ఏటీఎం కార్డులని, బస్సు టికెట్లను, ముఖ్యమైన బిల్స్ ని మొబైల్ కవర్ వెనక పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు మీరు కూడా ఇలా చేస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి.

Advertisement

కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే ఇలా డబ్బులు పెట్టుకోవడం లేదంటే బిల్స్, కాగితాలని పెట్టుకోవడం వలన ఫోన్ ఓవర్ హీట్ అయ్యి పేలిపోతుందట. తెలియక మనం చేసే ఈ చిన్న తప్పు ఎంతో పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. పైగా అనవసరంగా ఫోన్ పోతుంది. మీ ఫోన్ కూడా ఎక్కువగా వేడెక్కిపోతున్నట్లయితే కరెన్సీ నోట్లని పెద్ద పెద్ద పేపర్లని పెట్టుకోవద్దు వాటిని తొలగించేయండి. కొన్ని కొన్ని సార్లు మనం ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కుతుంది. కాగితాలు వంటివి ఉండడం వలన ఓవర్ హీట్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి తప్పుని ఇక మీదట చేయకండి.

Also read:

Visitors Are Also Reading