ప్రతి ఒక్కరూ కూడా రోజు దీపారాధన చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలగాలి. దీపారాధన చేసేటప్పుడు మనం ఒక కుందు తీసుకుని అందులో నూనె పోసి తర్వాత ఒత్తులు వేస్తాం. అయితే దీపారాధనకి వెండి కుందులు, పంచలోహ కుందులు. ఇతడి కుందులు ఎంతో మంచివి. మట్టి కుందులును కూడా దీపారాధనికి ఉపయోగించవచ్చు కానీ స్టీలు వాటిల్లో మాత్రం అసలు పెట్టకూడదు. కుందులని ప్రతి రోజు కూడా శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి. చాలా మంది కుందులని శుభ్రపరచకుండా వత్తులు తీసేసి వేరే వత్తులు వేసేసి దీపారాధన చేస్తూ ఉంటారు.
Advertisement
కానీ ప్రతి రోజు కూడా దీపాలని శుభ్రం చేసి తర్వాత వత్తులు వేసి వెలిగించాలి కార్తీకమాసం పర్వదినాలలో దీపారాధన చేస్తే ఎంతో మంచిది రాగి ప్రమిదలో దీపారాధన చేస్తే సర్వ రోగాలు పోతాయి దోషాలు కూడా పూర్తిగా పోతాయి. నేరుగా నేల మీద కుందులని పెట్టకూడదు ఒక పళ్ళెం తీసుకుని అందులో కానీ తమలపాకు మీద కానీ మీరు పెట్టవచ్చు ఎప్పుడూ కూడా కింద ఆధారం లేకుండా దీపాన్ని పెట్టకూడదు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులు వెలిగించకూడదు.
Advertisement
ముందుగా ఏక హారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే అడ్డవొత్తిని ఏక హారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలి. అగరవత్తులు, ఏక హారతి, కర్పూర హారతి ఇవ్వాల్సి వస్తే దీపారాధన నుండి వెలిగించకూడదు. ఒక వత్తి దీపాన్ని చేయకండి ఏక వత్తి దీపారాధనను అశుభ సందర్భంలో మాత్రమే చేస్తారు. దీపారాధనలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ ఉపయోగించవచ్చు. అలానే విప్పను వేప నూనె ఆముదం కొబ్బరి నూనె ని కూడా ఉపయోగించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెనగనూనెని దీపారాధనకి వాడకండి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!