Home » వంట చేసేటప్పుడు అస్సలు ఈ తప్పులు చెయ్యద్దు.. ఆరోగ్యం పాడవుతుంది..!

వంట చేసేటప్పుడు అస్సలు ఈ తప్పులు చెయ్యద్దు.. ఆరోగ్యం పాడవుతుంది..!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు కానీ కొంతమంది తెలియక చూస్తే చిన్న చిన్న పొరపాట్ల వలన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. మనం ఏ తప్పు చేయట్లేదు కదా మంచి కూరగాయల్ని ఎంచుకొని వండుకుంటున్నాం కదా..? ఫ్రెష్ గానే తింటున్నాము కదా నిల్వ ఉంచుకుని తినట్లేదు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే వంట పాత్రల విషయంలో తప్పులు. వండే పాత్రలు కూడా నాణ్యంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి పాత్రలో వండడం అనేది చాలా అవసరం. బంగారం తర్వాత విలువైన లోహం వెండి.

Advertisement

సిల్వర్లో యాంటీ మైక్రోబియన్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇందులో ఆహారం తింటే చాలా మంచిది రోగునిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వెండి పాత్రలో ఆహారాన్ని వేసుకుని తీసుకోవడం వలన శరీరం చల్లగా మారుతుంది. ఇప్పుడంటే స్టీల్ అల్యూమినియం పాత్రలని వాడుతున్నారు కానీ పూర్వం రాగి పాత్రలో వండే వాళ్ళు. రాగిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి రాగి లో నిల్వ ఉంచిన నీటిని తాగితే కూడా ఆరోగ్యానికి మంచిది ఆహారం వండుకోవాలంటే రాగి పాత్రని ఉపయోగించవచ్చు.

Advertisement

స్టీల్ పాత్రలు ఇప్పుడు అందరు ఇళ్లల్లో ఉంటున్నాయి స్టీల్ పాత్రలో వండడం వలన ఎటువంటి విషపూరిత పదార్థాలు విడుదల అవ్వవు. వంట కోసం స్టీల్ పాత్రలని వాడొచ్చు. ఇత్తడి లేదా బ్రాస్ పాత్రలో కూడా వండుకోవచ్చు జీర్ణక్రియనీ ఇది మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది అల్యూమినియం పాత్రలో ఆహారాన్ని వండితే ఇదే విషపూరితంగా మారవచ్చు కాబట్టి వీలైనంతవరకు అల్యూమినియం పాత్రలకు దూరంగా ఉండండి. ఇనుము పాత్రలో వండడం వలన రుచి పాడవుతుంది. నాన్ స్టిక్ లో కూడా ఎక్కువ వండుకోకూడదు.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading