Home » రాత్రి ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు.. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది..!

రాత్రి ఈ తప్పులు అస్సలు చెయ్యద్దు.. లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది..!

by Sravya
Published: Last Updated on
Ad

చాలామంది, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు దాని వలన ఎంతో పెద్ద నష్టం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేయకూడదు దాని వలన మీరే ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. ఈ తప్పులు కనుక చేశారంటే లక్ష్మీదేవి మీ ఇల్లును విడిచి వెళ్ళిపోతుంది. సాయంత్రం పూట అస్సలు గోళ్లు కత్తిరించకూడదు సాయంత్రం కాకుండానే గోళ్లు కత్తిరించుకోవాలి. రాత్రి పూట గోళ్లు ని కత్తిరించడం వంటివి చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

Advertisement

రాత్రిపూట పురుషులు కానీ స్త్రీలు కానీ పరిమళ ద్రవ్యాలని వేసుకోకూడదు. పర్ఫ్యూమ్స్ వంటివి కొట్టుకోవడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దుష్టశక్తులు ఇంట్లో తిరుగుతాయట కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకండి. అలానే చాలామంది మన ఇంటికి వచ్చి డబ్బు అవసరం ఇవ్వమని అడుగుతూ ఉంటారు అయితే రాత్రి పూట అప్పు ఇవ్వకూడదు. రాత్రిపూట ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పొరపాటు కూడా చేయొద్దు.

Advertisement

అలానే రాత్రిపూట తులసి మొక్కని ముట్టుకోకూడదు. తులసి ఆకులని కోయకూడదు. ఈ పొరపాటు కూడా చేయకండి. ఒకవేళ కనుక ఈ పొరపాటు చేస్తే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. దరిద్రం పట్టుకుంటుంది. సంతోషం శాంతి పోతాయి ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. అలానే వాస్తు ప్రకారం రాత్రిపూట అంట్ల గిన్నెలని వంటింట్లో వదిలేయకూడదు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటింట్లో రాత్రి పూట వండిన పాత్రల్ని వదిలేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా చూసుకోండి.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading