ప్రజల దైనందిన జీవితాలలో సెల్ ఫోన్లు విడదీయరాని బంధంగా మారిపోయాయి. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా సెల్ ఫోన్ ను ఉపయోగించకుండా ఏ పని పూర్తి కాదు. దశాబ్దం క్రితం ఫోన్ సౌకర్యం కావాలనుకునే వారు ఎక్కువ శాతం ల్యాండ్ లైన్ వినియోగించేవారు. కార్యాలయాలలో సైతం ల్యాండ్ ఫోన్ లే వినియోగించేవారు.
Advertisement
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. సెల్ ఫోన్ మైంటైన్ చేయాల్సిందే. స్మార్ట్ ఫోన్ లేకుంటే ఏదో వెలితి అన్నట్టు భావిస్తుంటారు. ఇలా రోజు రోజుకు మొబైల్ వాడకం పెరుగుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగానే స్మార్ట్ ఫోన్లలో రోజురోజుకు ఒక కొత్త ఫీచర్ ని తయారు చేస్తున్నాయి ఆయా కంపెనీలు. పెరిగిన వినియోగానికి తగ్గట్టుగానే సిమ్ కంపెనీలు కూడా ఆయా నెట్వర్క్ లు టవర్లను పెంచుతున్నాయి. కాల్స్ రద్దీ పెరిగిపోవడంతో సెల్ ఫోన్ కంపెనీలు టవర్లను బాగానే విస్తరించాయి. పట్టణాలలో అయితే ఇళ్లమీదనే టవర్లను చూస్తుంటాం.
Advertisement
అయితే స్మార్ట్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్స్ తో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. రేడియేషన్ వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్లో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ మీటింగ్ డివైస్ వల్ల ఫోన్లో నుండి రేడియేషన్ వస్తుంటుంది. ఫోన్లలో ఉండే సిమ్ కార్డుల నుంచి సిగ్నల్ ను ఆ డివైస్ తీసుకుని సమీపంలో ఉన్న నెట్వర్క్ కు రేడియో సంకేతాలు పంపిస్తుంది. అక్కడి నుంచి సంకేతాలు తిరిగి ఫోన్ కి వస్తాయి. అందువల్లే మనం ఫోన్ కాల్స్ మాట్లాడగలుగుతాం. అయితే ఫోన్లో సిగ్నల్ కోసం ఆ డివైస్ నిరంతరం టవర్ కి సిగ్నల్స్ ని పంపుతూనే ఉంటుంది.. తీసుకుంటూనే ఉంటుంది. దీనివల్ల ఫోన్ వినియోగంలో లేనప్పుడు తక్కువగా, కాల్స్ మాట్లాడేటప్పుడు ఎక్కువగా రేడియేషన్ విడుదలవుతుంది. అయితే ఏ ఫోన్ నుండి ఎంత మోతాదులో రేడియేషన్ విడుదలవుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.
అదిలాగంటే.. సాధారణంగా ఫోన్లో నుండి విడుదలయ్యే రెడియేషన్ ని SAR ( specific absorption rate) లో కొలుస్తారు. అంటే sar విలువ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ నుండి విడుదలయ్యే రేడియేషన్ స్థాయి అంత ఎక్కువగా ఉంటుంది. ఫోన్ కి చెందిన బాక్స్ పై ఆ ఫోన్ విడుదల చేసే రేడియేషన్ స్థాయి విలువను ప్రింట్ చేస్తారు. దీన్ని చూస్తే ఆ ఫోన్ కి చెందిన రేడియేషన్ స్థాయి మనకు తెలుస్తుంది. అంతేకాక ఫోన్ డైలర్ ఓపెన్ చేసి అందులో *#07# అనే నెంబర్ కి డయల్ చేస్తే ఆ ఫోన్ విడుదల చేసే రేడియేషన్ స్థాయి విలువ మనకు కనిపిస్తుంది. ఏ ఫోన్ అయినా సరే.. SAR వాల్యూ 1.6 W/KG(BODY, HEAD ) కన్నా తక్కువగా ఉండాలి. అలా ఉంటే ఆ ఫోన్ ను మనం సురక్షితంగా వాడుకోవచ్చన్నమాట. అంతకుమించిన sar వాల్యూ ఉన్న ఫోన్లను మనం వాడకూడదు. ఒకవేళ అలా వాడినట్లయితే రేడియేషన్ బారిన పడాల్సి వస్తుంది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !