హీరోల కొడుకులు హీరోలు అయినట్టే, డైరెక్టర్ల కొడుకులు కూడా హీరోలుగా టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొందరు సక్సెస్ అయితే చాలా వరకు ఫెయిల్ అయ్యారు. దానికి అనేక కారణాలున్నాయి. హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల కొడుకులెవరో ఇప్పుడు చూద్దాం!
1) పూరీ జగన్నాథ్ – ఆకాశ్ పూరీ :
పరిచయం అక్కర్లేని పేరు పూరీ జగన్నాథ్ ….ఆయన కొడుకు ఆకాశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించారు. మెహబూబా, రొమాంటిక్ మూవీస్ లో హీరోగా చేశాడు. టు ది ఫ్యాక్ట్ తండ్రి పేరుతో నెట్టుకొస్తున్నాడు తప్పితే ఈయనకంటే ఓ ప్రత్యేక ఇమేజ్ అయితే ఏర్పడలేదు.
Advertisement
2) శోభన్ – సంతోష్ శోభన్
వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇతడిలో మంచి యాక్టర్ ఉన్నాడు. పడాల్సిన సినిమా పడితే ఈ హీరో స్థాయే మారిపోతుంది.
3) MS రాజు – సుమంత్ ఆశ్విన్
ప్రొడ్యూజర్ నుండి వాన సినిమాతో డెరెక్టర్ గా మారిన MS రాజు కొడుక సుమంత్ తూనీగ తూనీగ సినిమాతో హీరోగా మారాడు. బట్ తండ్రికి వచ్చిన గుర్తింపు కొడుకు రాలేదు.
Advertisement
4) టి. కృష్ణ- గోపిచంద్
ప్రతిఘటన ఫేమ్ డైరెక్టర్ టి. కృష్ణ కొడుకే గోపిచంద్. విలన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ హీరోగా సక్సెస్ అయ్యాడు. యజ్ఞం, రణం ఈయన కెరీర్ బెస్ట్ సినిమాలు.
5) EVV సత్యనారాయణ – ఆర్యన్ రాజేష్ , అల్లరి నరేష్
జంద్యాల శిష్యుడిగా కామెడీ అండ్ ఫ్యామిలీ సినిమాలు తీసిన EVV ఇద్దరు కొడుకులు ఆర్యన్ రాజేష్ , అల్లరి నరేష్ లు హీరోలుగా ట్రై చేశారు. రాజేష్ అంతగా సక్సెస్ కాలేకపోయాడు. నరేస్ మాత్రం మంచి సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు.
6) రవి రాజా పినిశెట్టి – ఆది పినిశెట్టి
పెదరాయుడు ఫేమ్ డైరెక్టర్ రవిరాజా కొడుకు ఆది పినిశెట్టి కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు. రంగస్థలంలో కుమార్ బాబుగా ఆకట్టుకున్నాడు.
7) కోదండ రామిరెడ్డి – వైభవ్
చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి. ఈయన కొడుకు వైభవ్ గొడవ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
8) దాసరి నారాయణ రావు – దాసరి అరుణ్
దర్శకతరత్న దాసరి కొడుకు అరుణ్ 3 సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోయారు