Home » ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో న‌టుడు….! ప్ర‌తి సినిమాలో ప‌క్కా ఉండాల్సిందేనా..?

ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో న‌టుడు….! ప్ర‌తి సినిమాలో ప‌క్కా ఉండాల్సిందేనా..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా సెంటిమెంట్ లు ఉంటాయి. చాలా మంది ద‌ర్శ‌కులు సెంటిమెంట్ ల‌ను నమ్ముతూ ఉంటారు. హీరోయిన్ కు హిట్స్ ప‌డి ఫామ్ లో ఉంటే ఆ హీరోయిన్ అందంగా ఉన్నా లేక‌పోయినా వ‌రుస ఆఫ‌ర్ లు వ‌స్తుంటాయి. ఇదిలా ఉంటే హీరోయిన్ ల విష‌యంలోనే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల విష‌యంలోనూ ద‌ర్శ‌కులు సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటారు. టాలీవుడ్ లోని కొంత‌మంది ద‌ర్శ‌కుల సినిమాల్లో ప‌క్కాగా కొంద‌రు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు క‌నిపిస్తుంటారు. ఆ ద‌ర్శ‌కులు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం..

Advertisement

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌న సినిమాల్లో ప‌క్కాగా న‌టుడు చంద్ర‌శేక‌ర్ కు అవ‌కాశం ఇస్తాడు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శాంతినివాసం సీరియ‌ల్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా ఆ త‌ర‌వాత జ‌క్క‌న్న చేసిన సినిమాల‌న్నింటీ చంద్ర‌శేక‌ర్ మ‌న‌కు క‌నిపిస్తాడు.

హరీష్ శంక‌ర్ సినిమాల్లో రావు ర‌మేష్ ప‌క్కాగా ఉంటాడు. గ‌బ్బ‌ర్ సింగ్, మిర‌ప‌కాయ్ నుండి డీజే వ‌ర‌కూ అన్ని సినిమాల్లో రావు ర‌మేష్ న‌టించాడు.

Advertisement

పూరీజ‌గ‌న్నాత్ కు కూడా ఓ సెంటిమెంట్ న‌టుడు ఉన్నాడు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు సుబ్బ‌రాజు. అమ్మానాన్న ఓ త‌మిళ‌మ్మాయి సినిమా నుండి పూరీ సినిమాలో ప‌క్కాగా సుబ్బ‌రాజు క‌నిపిస్తాడు. దాదాపు పూరీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 70శాతం సినిమాల్లో సుబ్బ‌రాజు న‌టించాడు.

శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌తి సినిమాలో కూడా రావు ర‌మేష్ న‌టించారు. కొత్త‌బంగారులోకం, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల్లో అద్భుత‌మైన న‌ట‌న‌తో రావు ర‌మేష్ ఆక‌ట్టుకున్నాడు.

కృష్ణ‌వంశీ సినిమాల్లో ఎక్కువ‌గా బ్ర‌హ్మాజీ క‌నిపిస్తుంటాడు. కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నిన్నే పెళ్లాడ‌తా సినిమా నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చాలా సినిమాల్లో బ్ర‌హ్మాజీ న‌టించాడు.

Prime Video: Sindhooram

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సినిమాల్లో అమిత్ ఎక్కువ‌గా న‌టిస్తుంటాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చాలా సినిమాల‌లో అమిత్ విల‌న్ పాత్ర‌లో న‌టించాడు.

Amit Kumar

ఇవి కూడా చదవండి : జీవితం మొత్తం న‌టిస్తూనే ఉన్న ఈ స్టార్ న‌టుల గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading