ఒక సినిమా తీయాలంటే డైరెక్టర్ కు ఎంతో టాలెంట్ ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది..ఎవరిని హీరోగా తీసుకోవాలి ఇలా ప్రతివిషయాన్ని మ్యానేజ్ చేయగలగాలి. ఇక డైరెక్టర్ అంటే ఎంతో టాలెంట్ ఉండాలన్న సంగతి తెలిసిందే. దాంతో పాటూ చాలా నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక నాలెడ్జ్ రావాలంటే చదువులో కూడా ముందు ఉండాలి. అయితే ఇప్పుడు మన టాలెంటెడ్ డైరెక్టర్ లు ఎవరు ఏం చదువుకున్నారో చూద్దాం…టాప్ డైరెక్టర్ రాజమౌళి చదువు గురించి చాలా మందికి తెలుసు.
ఆయన కేవలం ఇంటర్ చదివారు. కానీ ఆయన స్కూల్ లో చదువుతున్నప్పుడు టాప్ స్టూడెంట్ అన్న విషయం చాలా మందికితెలియదు. క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్థానం, వెన్నెల సినిమాల దర్శకుడు దెవె కట్ట విదేశాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాత్ అనకాపల్లిలో డిగ్రీ పూర్తి చేశాడు.
Advertisement
Advertisement
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివారు. అదే విధంగా పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ గణితంలో మాస్టర్స్ పూర్తి చేశాడు. అంతే కాకుండా సుకుమార్ లెక్కల మాస్టారుగా విదేశాలలో పనిచేశారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా కేవలం ఇంటర్ చదివారు. కానీ కొట్టడంలో ఆయనను కొట్టే డైరెక్టర్ లేరనే చెప్పాలి. శ్రీనువైట్ల కూడా డిగ్రీ పూర్తి చేశారు.
అంతే కాకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వివి వినాయక్ కూడా డిగ్రీ పూర్తి చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కూడా కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. రేసుగుర్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మెడిసిన్ చదువుకు్నారు. ఆయన మొదటి సినిమా కూడా మెడికల్ కాలేజీ నేపథ్యంలోనే తెరకెక్కించారు. దర్శకుడు హరీష్ శంకర్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ మనిపాల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు.