ఉదయ్ కిరణ్ ఈ పేరును తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. నైన్టీస్ జనరేషన్ లో చాలా మందికి ఉదయ్ కిరణ్ ఫేవరెట్ హీరో. అంతే కాకుండా ఆ జనరేషన్ అమ్మాయిలకు కలల రాకుమారిడిగా ఉండేవాడు. చిత్రం, మనసంతానువ్వే, నువ్వేనువ్వే లాంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్నాడు. వరుస హిట్లు అందుకుంటున్న ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేయాలని ఆయన డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేవారు.
Advertisement
ఇలా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంటే ఉదయ్ కిరణ్ కెరీర్ అనుకోకుండా వచ్చిన సమస్యల వల్ల పూర్తిగా డౌన్ అయ్యింది. దాంతో చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్ ఉన్న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని అటు ఇండస్ట్రీకి ఇటు తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యాడు. ఇక ఉదయ్ కిరణ్ మరణించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఆయన సన్నిహితులు మిత్రులు ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు.
Advertisement
ఉదయ్ కిరణ్ కు ఎక్కువ క్లోజ్ గా ఉండేవారిలో దర్శకుడు తేజ కూడా ఒకరు. తేజ ఉదయ్ కిరణ్ కు చిత్రం, నువ్వే నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇచ్చాడు. దాంతో ఉదయ్ కిరణ్ గురించి తేజ కు చాలా విషయాలు తెలుసు. కాగా తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనతో ఫోన్ మాట్లాడినట్టు తెలిపారు. అంతే కాకుండా ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. కాకపోతే ఉదయ్ కిరణ్ కు ధైర్యం లేదని అన్నారు. తాను చనిపోయేలోపు అన్ని విషయాలు భయటపెడతానని తేజ బాంబు పేల్చారు. దాంతో తేజ ఉదయ్ కిరణ్ గురించి ఎలాంటి విషయాలు బయటపెడతారన్నది ఆసక్తికరంగా మారింది.