హ్యాపిడేస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ నిఖిల్ హిట్ ట్రాక్ పై ప్రయాణం చేస్తున్నాడు. రీసెంట్ నిఖిల్ కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా తరవాత 18 పేజిస్ అనే సినిమాతో ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అనుపమ పరవేశ్వరణ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను హీరో అయ్యిందుకు చాలా కష్టపడ్డానని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన తాను ఓ సీరియల్ లో చిన్న పాత్రలో నటించానని చెప్పాడు.
Advertisement
Advertisement
అక్కడే ఉంటే బుల్లితెరకే పరిమితం అవుతానని సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చినట్టు తెలిపాడు. ఈ క్రమంలో కొంతమంది దర్శకులు యాక్టింగ్ ను మెచ్చుకుని అవకాశాలు ఇస్తామని చెప్పి ఆ తరవాత పట్టించుకోలేదని చెప్పాడు. అంతే కాకుండా కొందరు నిన్ను హీరోను చేయాలంటే యాబై లక్షలు ఖర్చు అవుతాయని అనేవారని చెప్పాడు.
యాభై లక్షలు కోటి తీసుకువస్తే హీరోను చేస్తామని చెప్పేవారని అన్నారు. ఈ క్రమంలో ఓ దర్శకుడు తన వద్ద రూ.5లక్షలు తీసుకున్నాడని ఆ తరవాత లక్ష ఖర్చు అయ్యేవరకు షూటింగ్ చేసి ఆ తరవాత ఆపేశారని చెప్పాడు.