ప్రస్తుతం టాలీవుడ్ లో దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. పాన్ ఇండియా సినిమాలను దిల్ రాజు నిర్మిస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో చాలా పోటీ ఉన్న సమయంలో కొన్ని ఫ్యామిలీలే సినిమా పరిశ్రమను ఏలుతున్న సమయంలోనే దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా మొదటి సినిమా దిల్ తోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా తరవాత తన పేరునే దిల్ రాజుగా మార్చుకుని కెరీర్ లో తిరిగి చూసుకోలేదు.
Advertisement
ప్రస్తుతం నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఫుల్ బిజీగా ఉన్నాడు. దిల్ రాజు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా తమిళ స్టార్ విజయ్ హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలోనూ వారసుడు అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Advertisement
ఇండస్ట్రీలో నిలబడాలి అంటే రిస్క్ చేయాలని అన్నాడు. అన్ని భాషల్లో పెద్ద సంస్థలు ఉన్నాయని పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాయని చెప్పాడు. సినిమా కథను విని జడ్జిమెంట్ ఇచ్చే దమ్ముండాలని అలాఉంటేనే డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ అవ్వొచ్చని చెప్పాడు. తాను కూడా సినిమాలను జడ్జ్ చేయగలుగుతానని కానీ అలా చేసినప్పుడు మిస్ ఫైర్ కూడా అవుతుంటాయని చెప్పాడు.
అలా తీసుకున్న రెండు సినిమాలు తనను దారుణంగా దెబ్బ కొట్టాయని చెప్పాడు. మహేశ్ బాబు స్పైడర్ సినిమా..పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తనను ఫైనాన్షియల్ గా డ్యామేజ్ చేశాయని చెప్పారు. అయినా తట్టుకున్నానని…2017 సంవత్సరంలో నిర్మాతగా హిట్ లు కొట్టడం వల్లనే తట్టుకోలిగానని చెప్పారు.