నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలలో తారకరత్న కూడా ఒకరు. నందమూరి మోహన్ కృష్ణ కుమారుడైన తారకరత్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. అలాంటి తారకరత్న పేరిట ఒక ప్రపంచ రికార్డు ఉంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇందులో బాలకృష్ణ , ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీరికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కానీ నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేక పోయింది తారకరత్న మాత్రమే.
Advertisement
also read:తారకరత్న హెల్త్ బులిటెన్…డాక్టర్ లు ఏం చెబుతున్నారంటే…?
ఆయన చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఇక హీరోగా సినిమాలు చేయడం మానేశాడు. ఇక దర్శక నిర్మాతలు కూడా ఈయన వైపు చూడడం లేదు. ఇక జనాలు అయితే తారక రత్న ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయారు. అలాంటి తారక రత్న పేరిట ఒక వరల్డ్ రికార్డు ఉంది. ఇండస్ట్రీకి ఏ హీరో అయినా సరే ఒక్క సినిమాతో ఎంట్రీ ఇస్తారు. లేదంటే రెండు సినిమాలు. కానీ తారకరత్న మాత్రం ఏకంగా తొమ్మిది సినిమాలతో ఎంట్రీ ఇవ్వడం సంచలమైన విషయమే. 9 సినిమాలు అంటే ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఒకేరోజు మొదలుపెట్టలేదు. అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఇది వరల్డ్ రికార్డ్.. ఎందుకంటే హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో ఒకేసారి రావడం చిన్న విషయం కాదు. కానీ తారక రత్న దీన్ని నిజం చేసి చరిత్ర సృష్టించారు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చిన ఈ హీరో, ఈ చిత్రంతో పాటు మరో ఎనిమిది సినిమాలను ఒకేరోజు మొదలు పెట్టాడు.
Advertisement
కేవలం 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న రావడం రావడమే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. కొన్ని సినిమాలు ముహూర్తంతోనే ఆగిపోయాయి. ఇక ఆ టైంలో మొదలుపెట్టిన సినిమాల్లో ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక సినిమాల ద్వారా ఆయనకు కలిసి రాకపోవడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. త్వరలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. ఈ తరుణంలోనే యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు. బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మరి ఆయన క్షేమంగా బయటికి రావాలని మనమంతా కోరుకుందాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ కూడా తెలియజేయండి.
also read: