గత కొద్ది రోజుల నుంచి టీమిండియా క్రికెట్ లో అల్ల కల్లోలాలు జరుగుతున్నాయి. కెప్టెన్సీ విషయం లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల వల్ల వివాదాలు, గందోర గోల పరిస్థితులు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. అలాగే వన్డే కెప్టెన్సీ విషయం లో కూడా విరాట్ కోహ్లి కి అవమానం జరుగుతుందని కోహ్లి అభిమానులు, పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయా పడుతున్నారు. విరాట్ కోహ్లిని సంప్రదించ కుండా.. కోహ్లి నిర్ణయం తీసుకోకుండా.. కెప్టెన్సీ నుంచి తప్పించారనే వార్తలు వస్తున్నాయి.
Advertisement
అయితే బీసీసీఐ మాత్రం కోహ్లి విషయం లో మరోలా చెబుతుంది. టీ ట్వంటి జట్టు కెప్టెన్సీ బాధ్యత ల నుంచి కోహ్లి తప్పకుంటా అని బీసీసీఐ తో చెబితే అంగికరించలేదని.. కోహ్లి నే నిర్ణయం తీసుకుని టీ 20 కెప్టెన్సీ బాధ్యత ల నుంచి తప్పుకున్నాడని బీసీసీఐ చెబుతుంది. అయితే వైట్ బాల్ జట్టులకు ఇద్దరు కెప్టెన్ లు ఉండటం సరి కాదని కోహ్లి ని తప్పించామని వివరించారు. అయితే కోహ్లి నేతృత్వం లో కనీసం ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న మచ్చ మాత్రం ఉంది. దాని కోసమే కోహ్లి కి ఇష్టం లేకున్న వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి అవమానించారని ఫ్యాన్స్ అంటున్నారు.
Advertisement
అయితే ఇలాంటి అవమానం ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి విషయం లో గతంలో జరిగింది. 2003 వన్డే ప్రపంచ కప్ తర్వాత గంగూలీ ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. అప్పుడు కూడా గంగూలీ కి కెప్టెన్సీ వదులు కోవడం ఇష్టం లేదని.. ఆయినా.. బీసీసీఐ వల్ల కెప్టెన్సీ నుంచి దిగి పోవాల్సి వచ్చిందని అప్పట్లో అనే వారు. అయితే అప్పడు కెప్టెన్ గా గంగూలీ సక్సెస్ అయినా.. బ్యాట్స్ మెన్ గా విఫలం అవుతున్నాడనే కారణం తో కెప్టెన్సీ బాధ్యత ల నుంచి గంగూలీ ను తప్పించారు. దీంతో క్రికెట్ అభిమానులు ఈ ఇద్దరి ని పోలుస్తూ.. నాడు గంగూలీ కి.. నేడు విరాట్ కోహ్లి కి బీసీసీఐ నుంచి అవమానం ఎదురు అయిందని అంటున్నారు.