శోభన్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. చాలా సినిమాల్లో శోభన్ బాబు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శోభన్ బాబు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. జయలలితకి కూడా ఎంతో ఇష్టం. ఆ ప్రేమ కారణంగానే ఆయన్ని ఎంతో ప్రత్యేకంగా భావించేవారు. అంతేకాకుండా వేల కోట్లు ఆయనకు పంచిపెట్టారట. అప్పుడప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ పాత విషయాలు కూడా బయటికి వస్తూ ఉంటాయి. తాజాగా శోభన్ బాబుకి సంబంధించిన ఈ విషయం బయటపడింది.
Advertisement
శోభన్ బాబు ఎప్పుడు తానూ పెట్టుకున్న కట్టుబాట్లకి కట్టుబడి ఉన్నారు. జీవితాంతం అదే క్రమశిక్షణని కలిగి ఉన్నారు. ఏ అలవాట్లకి లోనవ్వలేదు. శోభన్ బాబును మాజీ సీఎం జయలలిత ఎంతగానో ఇష్టపడ్డారు. శోభన్ బాబు ఓకే చెప్తే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ సున్నితంగా శోభన్ బాబు తిరస్కరించారు జయలలిత మాత్రం శోభన్ బాబుని చాలా ప్రత్యేకంగా భావించారు, ఆ తర్వాత ఎంజీఆర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ అప్పటికి ఆయనకి పెళ్లి అయిపోయింది.
Advertisement
Also read:
శోభన్ బాబుకి ఆ సమయంలో వేల కోట్లు దానం చేశారట. అప్పట్లో ఎంజీఆర్ సీఎం గా ఉన్న సమయంలో స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచేవారు. సుమారు 3000 కోట్లు దాచారట ఆ వివరాలు తన తలపై టోపీలో దాచుకునే వారట, అవి జయలలిత చూసి వాటిని తీసుకుని ఆ డబ్బులు ఎలా ప్రాసెస్ చేయాలనేది తెలుసుకుని అమౌంట్ ని శోభన్ బాబుకి ఇచ్చారట. ఆ డబ్బుతో శోభన్ బాబు కొన్ని వందల ఎకరాల ల్యాండ్ కొని డెవలప్ చేశారట ఈ విషయాన్ని సీనియర్ రైటర్ తోటపల్లి మధు ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!