హీరో సుమన్ 1979 లో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. మొదట తమిళ ఇండస్ట్రీలో నటించారు. తర్వాత ఇద్దరి కిలాడీలు అనే మూవీతో తన తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. సుమన్ 80వ దశకంలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి హీరో. చదువుకున్నవాడు ఎంతో అందంగా ఉన్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో పట్టుకున్న వ్యక్తి. మంచి మంచి చిత్రాలు చేసి మంచి పేరు సంపాదించాడు.. చిరంజీవి విషయానికొస్తే 1978లో ప్రాణం ఖరీదు మూవీ తో ముందుగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఆ తర్వాత పునాదిరాళ్లు, పున్నమినాగు వంటి సినిమాల్లో నటించి చాలా గుర్తింపు పొందాడు. రుద్రవీణ ఇలాంటి మంచి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు చేశాడు. ఇలా ఇద్దరు సినీ జీవితం బాగానే కొనసాగుతుంది. కానీ 1980లో సుమన్ జైలు కి వెళ్ళాడు. ఆ సమయంలో అందరూ దానిలో చిరంజీవి హస్తం ఉందని రూమర్ క్రియేట్ చేశారు. ఇందులో ఎంత నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ పుకార్లు మాత్రం వచ్చాయి. సుమన్ మరియు ఆయన స్నేహితులు ఒక పార్టీ కి వెళ్ళినప్పుడు ఒక రే* కేస్ లాంటిది రిజిస్టర్ అయింది. దాంట్లో సుమన్ కి ఎలాంటి సంబంధం లేదు, అతని స్నేహితులు చేసినటువంటి తప్పు వల్ల కేసులో ఇరుక్కున్నానని సుమన్ ఇంటర్వ్యూలో అన్నాడు.
Advertisement
Advertisement
ఈ తరుణంలోనే అతని స్టేషన్ కు పిలిపించడం, అట్నుంచి జుడిషియల్ రిమాండ్ కు పంపడం, రెండు సంవత్సరాల జైలు శిక్ష, బెయిల్ రాకపోవడం, కేసు కొట్టివేయడం, ఈ తంతు కొన్నాళ్ళు సాగింది. సరిగ్గా ఎదిగే సమయంలో ఇలా జరగడంతో తన సినిమా కెరీర్ కి బ్రేక్ పడింది. ఇందులో ఇండస్ట్రీ కానీ, చిరంజీవికి కానీ ఎలాంటి ప్రమేయం లేదు. ఆయన ఒక ప్రముఖ హీరో కాబట్టి ఇలాంటి పబ్లిసిటీ అయింది. సుమన్ తో పాటుగా తన ఫ్రెండ్స్ డాక్టర్లు బిజినెస్ మ్యాన్ లు అందులో ఇరుక్కున్నారు. చివరికి కోర్టు ఎవరి తప్పు లేదని తేల్చి కేస్ కొట్టేసి వదిలేసింది.
also read;
రేణుదేశాయ్ గురించి ఆ డైరెక్టర్ ఏమన్నారో తెలుసా..?