ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఇంకా నాలుగైదు నెలలు ఉండగానే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 10 జట్లు ఈ మెగా ఈవెంట్ లో పోరాడనున్నాయి. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజులపాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీనికోసం ఇప్పటినుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు పెను మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
మొన్నటికి మొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో హెడ్ కోచ్ కు స్థానచలనం కలిగింది. జింబాబ్వేకు చెందిన లెజెండరీ బ్యాటర్ అండీ ఫ్లవర్ ను కొత్త హెడ్ కోచ్ గా ప్రకటించింది. హెడ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో అతన్ని అపాయింట్ చేసుకుంది. తాజాగా ఐపిఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఆడటం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ధోనికి ఇటీవలే సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతను రిహబిటేషన్ లో ఉంటున్నాడు. కొద్దిరోజులుగా బ్యాట్ కు దూరంగా ఉంటున్నాడు. సర్జరీ నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకు సర్జరీ అయిన విషయాన్ని ధోని ధ్రువీకరించాడు.
Advertisement
Advertisement
మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ ఆపరేషన్ నుంచి కోలుకుంటున్నానని వివరించాడు. అంతా బాగుంటే తాను ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఆడతానని స్పష్టం చేశాడు. ఆరోగ్యపరమైన సమస్యలు లేకపోతే, మోకాలి నొప్పుల సమస్యలు తలెత్తితే మాత్రం ఆడియన్స్ తో పాటు స్టేడియంలో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్లను చూస్తానని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మినీ వేలంపాటలను నిర్వహించాల్సి ఉంది. దీనికోసం నవంబర్ 15వ తేదీనాటికి రిటెన్షన్ ప్లేయర్ల వివరాలతో కూడిన జాబితాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తాను ఈ పనుల్లో తీరిక లేకుండా ఉన్నానని ధోని స్పష్టంచేశాడు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.