Devil Review : కళ్యాణ్ రామ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అతని కెరీర్ లో ఫస్ట్ టైం స్పై థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
తెల్లవారుజామునే సోషల్ మీడియాలో డెవిల్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది.ఈ సినిమా బాగుందని…..డెవిల్ కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
కథ మరియు వివరణ : కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా కథ విషయానికి వస్తే… రససాడు అనే దివాణంలో ఒక హ** జరుగుతుంది. ఆ హ** ఎవరు చేశారో తెలుసుకోవడం కోసం డెవిల్ వస్తాడు. ఈ సినిమాలో డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. నిజానికి డెవిల్… బ్రిటిషర్ల సీక్రెట్ ఏజెంట్. ఆ దివాణంలో హ** కోసం సీక్రెట్ ఏజెంట్ ఎందుకు వచ్చాడు అనేది ట్విస్ట్. మరోవైపు నైషద (సంయుక్త మీనన్) పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకము. నేతాజీ కలలు కన్న సమాజం కోసం జరిగిన విప్లవానికి, మాళవిక నాయర్ కు ఉన్న సంబంధం ఏంటి?
Advertisement
ఆ హ** ఎవరు చేసారు? ఎవరిని హత్య చేశారు? వాళ్లకు కళ్యాణ్ రామ్ పట్టుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే. డైరెక్టర్ నవీన్ మేడారం కథని పేపర్ మీద రాసుకున్న విధానం బాగుందేమో, కానీ చిత్రీకరించిన వైనం అంత గొప్పగా లేదు. కథలో ట్విస్ట్స్ ముందే ఊహించే అంత బేలగా ఉంది ఆర్టిస్ట్ నటన మరియు డైరెక్షన్. మాళవిక నాయర్, సంయుక్తమీనన్, ఎస్తేర్ అంతా వారి వారి పరిధిలో నటించారు. ఇంకాస్త మంచిగా నటించే అవకాశం ఈ కథలో ఉంది. కానీ డైరెక్టర్ అంతమేర వారికి అవకాశం ఇచ్చినట్టు కనబడలేదు. తమ్మి రాజుగారు ఎడిటింగ్ పర్లేదు అన్నట్టు ఉంది. చాలా మంచి కాన్సెప్ట్ తెరమీద ఎందుకనో తేలిపోయింది.
పాజిటివ్ పాయింట్స్
కళ్యాణ్ రామ్,
దర్శకత్వం
నెగిటివ్ పాయింట్స్
సాగదీత,
బిజిఎం
రేటింగ్ 2.75/5