గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ తో డేటింగ్ లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు పవిత్ర లోకేష్ నరేష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి ఓ స్వామీజీ వద్దకు వెళ్లి కలిసిన ఫోటో నెట్టెంట చెక్కర్లు కొట్టింది.
ఆ ఫోటోతో పాటు నరేష్ పవిత్ర లోకేష్ కలిసి హోటల్ లో ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వారితో గొడవపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అయింది. ఇక నరేష్ పవిత్ర లోకేష్ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు మొదలైన రోజు నుండి ఇద్దరి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది కానీ రీసెంట్ గా పవిత్ర లోకేష్ ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
నరేష్ తో కలిపి తనను అల్లరి చేస్తున్నారని పవిత్ర లోకేష్ తన ఫిర్యాదులో పేర్కొ పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరియు వెబ్సైట్లకు సంబంధించిన వివరాలను పవిత్ర లోకేష్ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక వాటితోపాటు యూట్యూబ్ ఛానల్ కనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి హస్తం ఉన్నట్టు పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఈ కేసు కు సంబంధించి పూర్తి సమాచారాన్ని సైబర్ క్రైమ్ ఏసిపి కేవీఎం ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
తనపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్ వెనుక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నట్టుగా పవిత్ర లోకేష్ అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు పవిత్ర లోకేష్ తన ఫిర్యాదులో రమ్య రఘుపతి, శివకుమారి, రామారావు పేర్లను చేర్చినట్టు తెలిపారు. పవిత్ర లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ కొనసాగిస్తున్నామని ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ కు నోటీసులు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొన్నవారందరిని నేడు విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆదేశించామని చెప్పారు.