సినిమా ఒప్పుకున్న తరువాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పనిచేయాలి. నటించాలి, మెప్పించాలి. అభిమానుల హృదయాలు గెలుచుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. మనుగడ సాగించగలుగుతారు. స్టార్స్‌గా ఎదుగుతారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ, సొంతంగా అభిమానులను సంపాదించుకున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు.
పుష్ప సినిమాలో పుష్పరాజ్‌గా ఆయన చేసిన పాత్ర కోసం ఎంత కష్టపడ్డారు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. పక్కా మాస్‌గా రగ్‌డ్‌గా కనిపించేందుకు బన్నీ గడ్డం పెంచడమే కాకుండా ముఖానికి, కాళ్లు చేతులకు కూడా మేకప్ వేసుకున్నారు. భుజం పైకిలేపి నటించారు. అలా కంటిన్యూగా నటించడం వలన భుజం నొప్పితో చాలా రోజులు బాధపడ్డారట. అయినప్పటికీ తగ్గేది లేదంటూ బన్నీ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. 2005లో ఒకసారి, 2011లో ఒకసారి బన్నీకి సర్జరీలు జరిగాయి. చాలా రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఎంత నొప్పి ఉన్నా కెమెరా ముందుకు వచ్చే సరికి అన్ని మర్చిపోయి నటిస్తానని బన్నీ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఈనెల 17 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగుతో పాటు దక్షిణాది, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్నది.
Advertisement