భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకప్పుడు భారత జట్టుకు మూడు ఫార్మాట్ లో ఇన్నింగ్స్ ను ఆరంభించేవాడు. కానీ ఆ తర్వాత టెస్టులో స్థానం అనేది కోల్పోయాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ లో బాగా రాణిస్తూ యువ ఆటగాళ్లు టీ20 జట్టులోకి వస్తుండటం, ఇక్కడ కూడా శిఖర్ స్థానానికి ఎసరు అనేది పెట్టింది. ఓపెనింగ్ కు పోటీ అనేది పెరగడంతో దావన్ టీ20 లో కనిపించకుండా పోయాడు. ఇప్పుడు టీమ్ ఇండియా దావన్ కు చాన్స్ లేకుండా పోయిందని చెప్పాలి.
Advertisement
ఇది ఇలా ఉండగా, తాజాగా శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగించే వాక్యాలు చేయొద్దని అతడి భార్య అయేషాకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శిఖర్ ధావన్ కు వ్యతిరేకంగా అవమానకరమైన తప్పుడు ప్రసారాలు చేయడం సరికాదని న్యాయమూర్తి హరీష్ కుమార్ ఆదేశించారు. సమాజంలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకోవడం చాలా కష్టమన్న ఆయన దావన్ పరువుకు భంగం కలిగే వాక్యాలు చేయటం సరికాదని అన్నారు. కాగా, ప్రస్తుతం శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది.
Advertisement
ఈ నేపథ్యంలో ఆయేషా తన ప్రతిష్టతను దెబ్బతీసేలా, గతంలో చేసిన చాట్ లీక్ చేస్తానని బెదిరిస్తుందని… ధావన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయేషాను అలా చేయొద్దని ఆదేశించింది. కాగా, శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా కు చెందిన ఆయేషా ముఖర్జీని 2012లో వివాహం చేసుకున్నాడు. ఆయేషాకు ధావన్ తో ఇది రెండవ వివాహం. దావన్ ను చేసుకునే సమయానికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్ ధావన్ ను వివాహం చేసుకున్నాక 2014లో వారికి ఒక కుమారుడు జన్మించారు. అయితే 2020లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవ్వడం వల్ల ఈ వ్యవహారం విడాకులు దాకా వచ్చింది.
READ ALSO : ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో సత్తా చాటిన ట్రాన్స్ జెండర్ అర్చన!