భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగపూర్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలిటెస్ట్ లో మొదటి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ 100 పరుగులకే ఆల్ అవుట్ అయిపోగా, అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన భారత జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 77/1 తో నిలిచింది. ఇది ఇలా ఉండగా, దాదాపు 5 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అదరకొట్టాడు. తొలిటెస్ట్ లో జడేజా ఐదు వికెట్లు తీసి రీఎంట్రీలో అదుర్స్ అనిపించాడు. ఈ విషయం పక్కన పెడితే, జడేగా చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసేందుకు జడ్డు సిద్ధమయ్యాడు. అప్పటికే జడేజా 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. క్రీజ్ లో అలెక్స్ క్యారీ, హ్యాండ్స్ కోబ్ ఉన్నారు. అయితే బౌలింగ్ వేయడానికి ముందు సిరాజ్ వద్దకు వెళ్ళిన జడ్డు అతని చేతి పై నుంచి ఏదో తీసుకున్నాడు. దానిని తాను బౌలింగ్ చేస్తున్న చేతికి రాశాడు. ఏం చేశాడు అన్నది క్లారిటీ లేదు కానీ వీడియో చూస్తే తన వేలికి ఏదైనా లోషన్ రాసుకొని ఉంటాడు అనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
అయితే జడేజా తీరుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టీం పైన్ ఆసక్తికరంగా స్పందించాడు. గ్రిప్పింగ్ కోసం జడేగా చేసిన పనిపై నువ్వేమంటావని టీం పైన్ నీ అడగ్గా, ‘ఇంట్రెస్టింగ్’ అని కామెంట్ చేశాడు. మరికొందరు జడేజా ఏమైనా చేటింగ్ చేశాడా అంటూ కామెంట్ చేయగా, కొందరు మాత్రం “అలాంటి చెత్త పనులు చేయాల్సిన అవసరం జడ్డుకు లేదని, అది కేవలం లోషన్ మాత్రమేనని, చూసి మాట్లాడండి” అంటూ జడ్డుకు మద్దతు పలికారు. అయితే దీనిపై టీం ఇండియా క్లారిటీ ఇచ్చింది. జడేజా ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది.
Cricketer #RavindraJadeja is being accused of ball tampering. Here's real truth behind viral video. #IndVsAus #FoxCricket pic.twitter.com/K8twP88fS7
— Shubhankar Mishra (@shubhankrmishra) February 9, 2023
READ ALSO : Pawan Kalyan: రెండోసారి దేవుడిగా చేయనున్న పవన్ కళ్యాణ్