సన్నాహక మ్యాచ్లో ఆసీస్ పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 276 పరుగులకు ఆల్ అవుట్ అయింది. పెసర్ మహమ్మద్ షమీ దాటిగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాటపట్టారు. ఈ ఇన్నింగ్స్ లో షమీ ఐదు వికెట్లతో ఆసిస్ తో దెబ్బ కొట్టాడు. ఇక చేజింగ్ లో టీమిండియా ఓపెనర్లు ఋతురాజ్ గైక్వాడ్, గిల్ అర్థసంచరీలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
గైక్వాడ్ 71 పరుగులు చేయగా, గిల్ 74 పరుగులతో సత్తా చాటారు. ఇక సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ చెరో హాఫ్ సెంచరీ నెలకొల్పారు. చివర్లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడారు. జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ దాటిగా ఆడి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లేకుండానే బరిలోకి దిగిన భారత్… ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించడంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా, చివరివరకు క్రిజ్ లో ఉండి జట్టును గెలిపించిన కేఎల్ రాహుల్, జడేజా ఆసిస్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తున్న క్రమంలో ఆ స్టార్ బ్యాటర్ డేవిడ్ బాయ్ జడేజాను నెత్తిపై కొట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన జడేజా వైఫ్, బిజేపి ఎమ్యెల్యే రివాభ సీరియస్ అయ్యారట. కాగా, ఐపిఎల్ కారణంగా జడేజా, డేవిడ్ వార్నర్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. గత సీజన్లో డేవిడ్ పరుగు తీసే క్రమంలో జడేజా బంతిని వికెట్లను కొట్టబోతుండగా అప్పుడు వార్నర్ జడేజా కత్తి సెగ్మెంట్ ను చేసి అందరినీ నవ్వించాడు. వార్నర్ టీమిండియా ఆటగాళ్లతోనూ అంతే సరదాగా ఉంటాడు.
ఇవి కూడా చదవండి
- చిరంజీవి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. 650 కోట్ల నష్టం ?
- Priyamani : నా వయసు 38..అయినా నన్ను ఆంటీ అని పిలవండి !
- Nani : తన భార్యకు తెలియకుండా ఆ అమ్మాయిని సీక్రెట్ లవ్ చేసిన నాని ?