నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన పాన్ ఇండియా చిత్రం దసరా. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ అయింది. నాని జతగా కీర్తి సురేష్ నటించిన డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై రెండు రోజులైంది. ఈ రెండు రోజుల్లో సినిమా పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. నాని కెరీర్ లోనే బెస్ట్ నెంబర్స్ కలెక్ట్ అవుతుండటం, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ అంగన్వాడీ టీచర్ గా నటించింది. అయితే ఓ సన్నివేశంలో కీర్తి సురేష్ ఎవరు చూడకుండా ఆమె పనిచేస్తున్న చోటుకు వెళ్లి కోడిగుడ్లు, బియ్యం వంటివి దొంగతనం చేస్తున్నట్టు చూపించారు.
READ ALSO : 1964 లో “అంబాసిడర్” కారు ధర ఇంత తక్కువా? వైరల్ అవుతున్న బిల్!
Advertisement
అలాగే ఆమె ఆ గుడ్లు వంటివి తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు కూడా చూపించారు. ఈ సన్నివేశాల పట్ల అంగన్వాడీ టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ హెచ్చరించడం కూడా చర్చనీయాంశమైంది. ఎస్డిఎస్ లో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించకుండా అంగన్వాడీ టీచర్లు దొంగలు అన్నట్టు చూపించారు. ఎన్నో ఏళ్లుగా అంగన్వాడి టీచర్లు చేస్తున్న సేవలు ఎవరికి తెలియదు. కేవలం రూ. 150 జీతం నుండి పనిచేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు కేంద్రం మాకు ఏమీ ఇవ్వడం లేదు.
Advertisement
READ ALSO : మాజీ సీఎం మనవడితో మళ్ళీ దొరికిన జాన్వి కపూర్… వీడియో వైరల్!
అయినా మా సొంత డబ్బులు పెట్టుకుని అంగన్వాడి కేంద్రాలు నడుపుతున్న సందర్భాలు ఉన్నాయి. మాకు జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో పాటు మేము అందరికీ పాలు, గుడ్లు వంటివి ఇచ్చామా లేదా అని ఫోన్లు కూడా చేస్తారు. మేము ఫోటోలు కూడా తీసి పంపాలి. దర్శకుడు అవేవీ చూడకుండా మమ్మల్ని దొంగలు అన్నట్టు సినిమాలో చూపించాడు. ఆ సన్నివేశాన్ని అర్జెంటుగా తొలగించాలి. మేము ఆల్రెడీ సెన్సార్ బోర్డు సభ్యులకు లేఖ రాయడం జరిగింది. ఆ సన్నివేశాన్ని కనుక వెంటనే తొలగించకపోతే సినిమాని ఆడకుండా నిరసనకి దిగుతాము అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO : అమలా టార్చర్ భరించలేకనే సమంత… నాగచైతన్యతో విడిపోయిందా…!