ప్రజా భవన్ గా ఉన్న పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చింది. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారంలోకి రాగానే ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమం లోనే వారానికి రెండు రోజులు మంగళవారం, శుక్రవారంలో ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.
Advertisement
Advertisement
రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు తెల్లవారుజాము వరకే ప్రజాభవన్ కి చేరుకున్నారు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చలిలో ఉదయం 5 గంటలకే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ప్రజాభవన్ కి రావడం జరిగింది. ఉదయం తొమ్మిది గంటల దాకా ప్రజా భవన్ ముందు కిలోమీటర్ క్యూ లైన్ పెరిగిపోయింది. అక్కడ ఉన్న భద్రత సిబ్బందికి చాలా కష్టమైంది ప్రజావాణిలో ఎక్కువ భూమి సమస్యలు ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం, పింఛన్లు, ఇల్లు వంటి అంశాలపైనే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజా దర్బార్ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజావాణికి మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్ కి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రజావాణిని ఎమ్మెల్యేలతో నిర్వహిస్తే బాగుంటుందని వాదనలు వినపడుతున్నాయి. ప్రజా భవన్ వద్ద రద్దీ కూడా తగ్గి ఒత్తిడి తగ్గుతుందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!