Home » శిఖర్ ధావన్ కు విడాకులు..ఇక మరో పెళ్లికి రెడీ !

శిఖర్ ధావన్ కు విడాకులు..ఇక మరో పెళ్లికి రెడీ !

by Bunty
Ad

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో ప్రతి మ్యాచ్లో ఆడి… టీమిండియా కు అనేక విజయాలను అందించాడు ఓపెనర్ శిఖర్ ధావన్. అయితే ఈ మధ్యకాలంలో టీమిండియాలో చోటు దక్కించుకోలేక సతమతమవుతున్నాడు. గిల్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి ధావన్ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో కూడా ధావన్ పేరు లేకపోవడం గమనార్హం.

Advertisement

అయినప్పటికీ లైట్ తీసుకున్న శిఖర్ ధావన్… తన లైఫ్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్ జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించిందన్న ధావన్ వాదనలను కోర్టు సమర్ధించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నేళ్లపాటు విడిగా ఉండాలని భార్య ఒత్తిడి చేయడంతో దావన్ మానసిక వేదనకు గురైయ్యారని పేర్కొంది.

Advertisement

ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడిని కలిసేందుకు, సెలవుల్లో ఇండియాకు తీసుకువచ్చేందుకు దావన్ కు అనుమతి ఇచ్చింది. ఇక విడాకులు మంజూరు కావడంతో తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ధావన్ సిద్ధమైనట్లు కూడా జోరుగా ప్రచారం అందుకుంది. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య దావన్ పెళ్లిపై చర్చలు జరిగాయట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading