ఒలంపిక్స్ లో క్రికెట్ ని కూడా చేర్చాలని డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. అయితే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 2028లో జరగబోయే ఒలంపిక్స్ లో క్రికెట్ ను కూడా నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. క్రికెట్ తో పాటు బేస్ బాల్, ఫుట్బాల్ లాంటి మరికొన్ని క్రీడలను ఒలంపిక్స్ లో చేర్చాలని ప్రతిపాదించినట్లు లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ నిర్వాహకులు వెల్లడించారు.
దీనిపై అక్టోబర్ 15న ముంబైలో జరిగే అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం ఉంది. అదే నిజమైతే దాదాపు 128 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. 1900లో జరిగిన ప్యారిస్ ఒలంపిక్స్ లో ఒకే ఒకసారి క్రికెట్ ను నిర్వహించారు. అందులో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జట్లు మాత్రమే ఆడాయి.
Advertisement
Advertisement
ఆ తర్వాత వివిధ కారణాలతో ఈ ఆటను తొలగించారు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ప్రయత్నాలు జరుగుతుండటంతో ఐసీసీ కూడా సంతోషం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023 మన ఇండియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. ఇక ఈ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై టీమిండియా ఘన విజయం సాధించి మంచి ఆరంభాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండి
- అతనితో రిలేషన్షిప్ లో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ ?
- అల్లు శిరీష్ కి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లి చేసుకోవట్లేదా..?
- లావణ్య త్రిపాఠి కోసం మెగా హీరోలు భారీ త్యాగం… చిరంజీవి కూడా ?