Home » WTC Final 2023 : అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ బలి!

WTC Final 2023 : అంపైర్ తప్పుడు నిర్ణయానికి శుభ్‌మన్ గిల్ బలి!

by Bunty
Ad

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. లండన్ వేదికగా ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మొన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు ఆసిస్..కాస్త ఎడ్జ్ లో ఉంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆల్లౌట్ అయింది. అలాగే రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా…270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

Advertisement

ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు అల్లౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా…3 వికెట్లు కోల్పోయి…164 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అజింక్య రహానే ఇద్దరు క్రేజ్ లో ఉన్నారు. ఇవాళ చివరి రోజు కావడం తో…మరో 280 పరుగులు ఇండియా చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా, 4వ రోజు మ్యాచ్ లో ఇండియా ఓపెనర్ గిల్…ఔట్ కావడం వివాదాస్పదంగా మారింది.

Advertisement

గిల్ క్యాచ్ ను స్లీప్ లో కామెరాన్ గ్రీన్ డైవ్, చేసి పట్టాడు. అయితే, ఆ క్యాచ్.. నేలకు తకినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ థర్డ్ అంపైర్, దాన్ని ఔట్ గా ప్రకటించారు. అయితే, గిల్ ఔట్ అయిన సంఘటన పై…. క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ అంపైర్ కు అసలు కళ్ళు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. ఇక ఈ వివాదం పై సెహ్వాగ్ కూడా స్పందించారు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టారు.  గిల్ ను ఔట్ ఇవ్వడం చాలా తప్పిదం అన్నారు సెహ్వాగ్. అంపైర్ కు అసలు కండ్లు మూసుకొని పోయాయా ? అంటూ ఫైర్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్. కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ మరియు రహానే విజృంభిస్తే, ఇండియా గెలిచే అవకాశం ఉంది. లేకపోతే, ఆస్ట్రేలియా గెలిచే అవకాశం ఉంది.

 

 

Visitors Are Also Reading