మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇటలీలో వైభవంగా వీళ్ళ పెళ్లి జరిగింది. ఇటలీకి వెళ్ళిన మెగా ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితమే ఇండియాకి వచ్చేసారు. ఇప్పటికే మెగా కుటుంబంతో పాటుగా లావణ్య ఫ్యామిలీ సన్నిహితులు తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. కొన్ని ఏళ్ళు గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు.
Advertisement
వీళ్ళ పెళ్లి నవంబర్ ఒకటిన ఇటలీలో వైభవంగా జరిగింది. అక్టోబర్ 30 నుండి మెహందీ, సంగీత్ జరిగాయి. మెగా ఫ్యామిలీలోని సురేఖ, ఉపాసన, లావణ్య త్రిపాఠిల మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ సహాయం చేయడంలో ముందు ఉంటారు. అలానే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా సేవ చేస్తూ ఉంటుంది. ఉపాసనా పలు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటుంది.
Advertisement
వీళ్ళ లాగానే లావణ్య త్రిపాఠి కూడా సహాయం చేయడంలో ముందుంటారని తెలుస్తోంది. తన సంపాదనలో 50% పేదలకు పంచుతుందట. ఆమె చేసిన గొప్ప పనుల గురించి ఆమె పెద్దగా చెప్పుకోదు కూడా. ఈ ముగ్గురిలో కూడా ఈ కామన్ పాయింట్ ఉంది ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది వాళ్ళ హెల్పింగ్ నేచర్ ని చూసి నెటిజెన్స్ ప్రశంసిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!