Home » నాని, రవితేజ లో వున్న ఈ కామన్ పాయింట్ ఏమిటో తెలుసా..?

నాని, రవితేజ లో వున్న ఈ కామన్ పాయింట్ ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలలో వీళ్ళు కూడా ఒకరు. వీళ్ళిద్దరూ కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలగా దూసుకు వెళ్ళిపోతున్నారు. సినిమాలు హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు తీస్తున్నారు. నాని సంగతి పక్కన పెడితే రవితేజ ఈ వయసులో కూడా అదే ఊపుతో ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ, మాస్ మహారాజా ఫ్యాన్స్ ని ఖుష్ చేస్తున్నారు. నాని కూడా వరుసగా సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టం. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్నదే. ఇక ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన రవితేజ నాని లో కామన్ పాయింట్ ఏంటి అనేది చూస్తే సాధారణంగా దర్శకులు హీరోలకి కథలు చెబుతూ ఉంటారు. ఆ కథ నచ్చిందా లేదా అని చెప్పడానికి హీరోలు కొంచెం టైం తీసుకుంటారు.

Advertisement

ఆ తర్వాత నిదానంగా చెప్తారు కానీ ఈ విషయంలో మాత్రం నాని రవితేజ ఇద్దరు ఒకేలా ఉంటారు. డైరెక్టర్లు సినిమా కథ చెప్పినప్పుడే నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని వెంటనే చెప్పేస్తారట. మాస్ మహారాజా రవితేజ కెరియర్లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి ఇక తాజాగా రిలీజ్ అయిన ఈగల్ సినిమా కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది నాని చివరగా హాయ్ నాన్న సినిమా చేసి అందరిని మెప్పించారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నాని.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading