విరాట్ కోహ్లీ గురించి తెలియని వారుండరు. అయితే, తన పుట్టినరోజు నాడు 49వ వన్డే సెంచరీ స్కోర్ చేసిన కింగ్ కోహ్లీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు కదా. పుట్టినరోజు నాడు ఈ ఘనత సాధించడం అంటే ఇంతకన్నా బెస్ట్ ఇంకొకటి ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. కానీ ఈ ఘనతకు 175 అనే సంఖ్యకు ఉన్న అదిరిపోయే కో ఇన్సిడెంట్ ఏంటో తెలుసా…?
సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో 452 ఇన్నింగ్స్ లో 49సెంచరీలు స్కోర్ చేశాడు. కోహ్లీ 277వ ఇన్నింగ్స్ లో ఆ మార్క్ అందుకున్నారు. ఇద్దరి మధ్య ఇన్నింగ్స్ డిఫరెంట్ ఎంతో తెలుసా…. 175. కోహ్లీ వన్డే క్యాప్ నెంబర్ కూడా సేమ్ అదే 175. అంటే ఇండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన 175వ ప్లేయర్ భలే కో ఇన్సిడెంట్ కదా..కానీ ఇక్కడితో అయిపోలేదు.
Advertisement
Advertisement
14 ఏళ్ల క్రితం ఇదే నవంబర్ 5వ తేదీన ఆస్ట్రేలియా మీద సచిన్ టెండూల్కర్ ఓ అద్భుతమైన సెంచరీని స్కోర్ చేశాడు. ఆ స్కోర్ 175. ఇప్పుడు నవంబర్ 5వ తేదీన 175 ఇన్నింగ్స్ తక్కువ ఆడి సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. క్రికెట్ లో ఈ స్థాయి కో ఇన్సిడెంట్ తక్కువ అని చెప్పుకోవాలి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.