Home » స్టార్ హీరో ఇంటికి కోడలుగా కమెడియన్ పృథ్విరాజ్ కూతురు.. ఎవరంటే..?

స్టార్ హీరో ఇంటికి కోడలుగా కమెడియన్ పృథ్విరాజ్ కూతురు.. ఎవరంటే..?

by Sravya
Ad

కమెడియన్ పృథ్వీరాజ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయిపోయారు పృథ్వి. చాలా సినిమాల్లో కమెడియన్ గా అందరినీ ఎంటర్టైన్ చేశారు ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చినటువంటి పృథ్వీరాజ్ కి ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ప్రస్తుతం రాజకీయాల్లో నుండి నెమ్మదిగా దూరం అయిపోతున్నారు. ఈయన సినిమా అవకాశాలని పొందుతూ కెరీర్ పరంగా బిజీగానే ఉంటున్నారు. పృథ్వీరాజ్ తాజాగా తన కూతురు శ్రీలు హీరోయిన్ గా కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకి దర్శకత్వం వహించారు.

Advertisement

తాజాగా ఆయన తన కూతురితో పాటు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రస్తుతం ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ శ్రీలు పెళ్లి ప్రస్తావన గురించి తీసుకురావడం జరిగింది గతంలో ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కొద్దిరోజుల్లో స్టార్ హీరో ఇంటికి కోడలు కాబోతున్నారని ఆమెని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి ఆమె తెగ సిగ్గు పడిపోయారు.

Advertisement

పృథ్వీరాజ్ సైతం ప్రేమ వ్యవహారాల గురించి కొన్ని విషయాలు చెప్పారు ఎవరి ఇంటికి కోడలుగా వెళ్లబోతుందనే విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యేదాకా ఆగాలి. ఎవరు అబ్బాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజెన్స్. ఇప్పటిదాకా నాన్న ఇండస్ట్రీలో ఉండి ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనే ప్రశ్న కూడా వచ్చింది పృథ్వీరాజ్ ని ప్రశ్నిస్తూ రాపిడ్ ఫైర్ లో భాగంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు అని కూడా అడిగారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading