Home » ఆర్య లో ఈ కమెడియన్ మీకు గుర్తున్నాడా..? ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు…?

ఆర్య లో ఈ కమెడియన్ మీకు గుర్తున్నాడా..? ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు…?

by Sravya

కమెడియన్ గా పలు సినిమాలో నటించి బబ్లు అప్పట్లో బాగా ఆకట్టుకున్నారు. చాలా మంది టాప్ హీరోల పక్కన నటించాడు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనపడట్లేదు బబ్లు. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి ఆకట్టుకున్నాడు బబ్లు. కొంచెం బొద్దుగా క్యూట్గా తన కామెడీతో నవ్విస్తూ ఉంటాడు. ఆర్య సినిమాతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు ప్రస్తుతం అయితే ఏ సినిమాలో కూడా చేయట్లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బబ్లు మాట్లాడుతూ చిన్నప్పటినుండి కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను.

టెన్త్ క్లాస్ చదివే టైంలో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. దాంతో వరుస సినిమాల్లో నటించాను. 2012లో నాన్న చనిపోయారు ఆయన చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా వదిలేసుకుని బ్యాంకాక్ వెళ్లిపోయాను అని బబ్లు చెప్పారు. ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడట. అలానే ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు బబ్లు చెప్పాడు. ప్రస్తుతం యాక్టింగ్ అకాడమీలో పనిచేస్తున్నట్లు బబ్లు ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

Also read:

Visitors Are Also Reading