ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరే వినిపిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదట ఈ సినిమాను కన్నడలో విడుదల చేయగా ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ డబ్ చేశారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా సినిమాలో హీరో గా కూడా రిషబ్ శెట్టి నటించారు.
Advertisement
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాగా ప్రేక్షకులు ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు. సినిమాలో రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా వల్ల కన్నడ నాట థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాపై ఎన్టీఆర్ ,ప్రభాస్ లాంటి హీరోలు ప్రశంసలు కురిపించడంతో తెలుగులోను చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది.
Advertisement
వసూళ్ల పరంగానూ ఈ సినిమా దూసుకుపోతోంది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు రంగస్థలం సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్ కు పోటీగా నిలబడ్డాడు అనే కారణంతో రామ్ చరణ్ తన అన్నను ప్రెసిడెంట్ చంపేశాడు అని భావించి అతడిపై పగ తీర్చుకుందాం అనుకుంటాడు. కానీ అసలు విలన్ ప్రకాష్ రాజ్ అని తెలిసి అతడిని హతమారుస్తాడు. అచ్చం అదేవిధంగా కాంతార సినిమా క్లైమాక్స్ ఉంది.
కాంతార సినిమాలలో మొదట దొరకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి తన తమ్ముడిని చంపాడనే కోపంతో అతడిని చంపేందుకు సిద్ధమవుతాడు. కానీ చివరికి దొరే అసలు దొంగ అని తెలుసుకుని దేవుడి వేషంలో వచ్చి హత మారుస్తాడు. మరోవైపు రెండు సినిమాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రియలిస్టిక్ గా తెరకెక్కించారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులకు గుర్తుండి పోయే సినిమాలు గా నిలిచాయి.