అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట వచ్చిన జులాయి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మైండ్ గేమ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంతేకాకుండా అదే రేంజ్ లో సోనూసూద్ సైతం విలనిజం ప్రదర్శించడం ఈ సినిమాకు మరో హైలెట్. ఈ సినిమాలోని డైలాగులు పాటలు ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
Advertisement
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా అల వైకుంఠపురం లో…. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ చిత్రం కూడా మ్యూజికల్ గా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాకు జూలాయి సినిమాకు ఓ కామన్ పాయింట్ ఉంది అన్న సంగతి చాలా మందికి తెలియదు.
Advertisement
నిజానికి అది చాలా చిన్న పాయింట్… కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో ఆ పాయింట్ ను గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ కామన్ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జూలయి సినిమాలో బ్రహ్మాజీ ఓ ట్రావెల్ ఏజెన్సీని కలిగి ఉంటాడు.
దాని పేరు “ప్యాక్ యువర్ బ్యాగ్స్” అయితే అదే విధంగా అలా వైకుంఠపురం సినిమాలోను మనకు పాక్ యువర్ బ్యాగ్స్ అనే కంపెని కనిపిస్తుంది. అలా రెండు సినిమాల్లో ఓకే కంపెనీ పేరు ఉండడంతో ఈ కామన్ పాయింట్ ను గమనించారా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి.