Home » ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..సిఎం జగన్ ప్లాన్ ఇదేనా ?

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..సిఎం జగన్ ప్లాన్ ఇదేనా ?

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది కాలం మాత్రమే ఉంది. దీంతో ఇప్పటినుంచి అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇక అటు నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మరియు తదితరులను కలిశారు సీఎం జగన్.

Advertisement

ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఏకంగా గంట పాటు సీఎం జగన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేలా.. చూడాలని, ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్ కోరినట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఏపీలో వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ మొత్తం తిరిగితే… వైసిపి పార్టీకి షాక్ తప్పదని కొంతమంది చెబుతున్నారు.

Advertisement

ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నందున.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం తిరుగుతాడని… ఓట్లు రాబట్ట గలుగుతాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సమయం ఇవ్వకుండా… తెలంగాణతో పాటే ఏపీలో ఎన్నికలను నిర్వహించేందుకు సీఎం జగన్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కావడానికి వెనుక కూడా ఇదే కారణమని చెబుతున్నారు.దీంతో నిన్నటి నుంచి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని జోరుగా ప్రచారం అయితే మొదలైంది. దీనిపై క్లారిటీ రావాలంటే నవంబర్ మాసం వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

టీమిండియా సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతం ఎంతో తెలుసా? ప్రధాని కంటే ఎక్కువ!

ధోనీ ‘కెప్టెన్‌ కూల్‌’ కాదు.. బూతులు తిడతాడు – ఇషాంత్ శర్మ

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

Visitors Are Also Reading