Ad
జనవరి 1 2022 నుండి బట్టలు, చెప్పుల రేట్లు 7శాతం పెరగనున్నాయి. దీనికి కారణం 5 శాతం GST స్లాబ్ లో ఉన్న బట్టలు, చెప్పులను 12 శాతపు GST స్లాబ్ లో వేశారు. దీంతో 7 శాతం మేర రేట్లు పెరగనున్నాయి. సింథటిక్ ఫైబర్ , నూలు లపై GST రేట్లు 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించబడినప్పటికీ బట్టలపై 7 శాతం పెంచడం విచిత్రం.
Advertisement
Advertisement
దీనికి సంబంధించి CBIC ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సంస్థ నవంబర్ 18 న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై భారత దుస్తుల తయారీదారుల సంఘం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ భారం బ్రాండెడ్ దుస్తువులు, చెప్పులపై మరింత పడనుంది.