రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ అందాల తార లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో నాగబాబు ఇంట్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వరుణ్ లావణ్య కలిసి మొదటిసారి మిస్టర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆనాటి నుండే ఇద్దరు లవ్ లో ఉండగా రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.
ఎంగేజ్మెంట్ కు మెగా ఫ్యామిలీతో పాటు పలువురు కుటుంబ సభ్యులు… స్నేహితులు హాజరయ్యార. అయితే మొదట అంతా లావణ్య త్రిపాఠి అదృష్టవంతురాలు మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది అనుకున్నారు. ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీ కి గౌరవం ఉంది అని అలాంటి ఫ్యామిలీకి కోడలు అవ్వబోతుంది కాబట్టి లక్కీ అనుకున్నారు. అంతేకాకుండా వరుణ్ తేజ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడని అనుకున్నారు.
Advertisement
Advertisement
అయితే ఇప్పుడు తెరపైకి కొత్త విషయం వచ్చింది. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుకోవడానికి కారణం ఆమెది రాయల్ ఫ్యామిలీ అని అన్నాడు. లావణ్య త్రిపాఠికి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పాడు. అందుకోసమే వరుణ్ తేజ్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేశాడు.
దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిట్టిబాబు మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో చిట్టి బాబు సెలబ్రెటీలపై వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డాడు. సమంతపై చిట్టిబాబు నెగిటివ్ కామెంట్స్ చేయగా సమంత సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది. ఇక చిట్టిబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలపై లావణ్య త్రిపాఠి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.