ఏ సినిమా చేసినా హీరోల జోక్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. సినిమాకు ముందే కథ మరియు కథనం విషయంలో హీరో హీరోయిన్లు ముందే తెలుసుకుని ఓకే చెబుతూ ఉంటారు. తాజాగా ఆచార్య మూవీ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ జోక్యం చేసుకున్నారని అనేక వార్తలుసోషల్ మీడియాలో వస్తున్నాయి. దీని వల్లనే సినిమా డిజాస్టర్ అయిందని అంటున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు కానీ ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోగా పేరు పొందిన చిరంజీవి సినిమా కథ విషయంలో జోక్యం చేసుకుంటే తప్పేముంది అనే కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఇంకా డిజాస్టర్ అయ్యేది కావచ్చు. వారి జోక్యం వల్లనే కొంత విజయాన్ని సాధించిందని అనుకోవచ్చు కదా అని కూడా కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క అపజయం కూడా లేని దర్శకుడు కొరటాల శివ. కానీ ఈ సినిమాతో శివకు ఫ్లాప్ వచ్చి పడింది. కొరటాల శివ స్వతహాగా రచయిత, ఇప్పటివరకు ప్రేక్షకులను మెప్పించే కథలతో భారీ విజయాలను అందుకున్నారు. కానీ ఆచార్య మూవీ మాత్రం కొరటాల శివ సినిమాలా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కొరటాల శివ మొదట అనుకున్న సినిమా ఫైనల్ కి వచ్చేసరికి ఎన్నో మార్పులు జరిగాయని, ఈ మూవీలో రామ్ చరణ్ పాత్రను 15 నిమిషాల కంటే ఎక్కువగా కొరటాల శివ రాసుకోలేదని సమాచారం. అయితే చిరు మరియు రామ్ చరణ్ స్క్రీన్ మీద ఎక్కువ సేపు ఉండాలి అనే ఆలోచన వల్ల 45 నిమిషాలు పొడగించారని అందుకే మూవీ దెబ్బతిన్నదని చెబుతున్నారు కొంతమంది విశ్లేషకులు.
Advertisement
ALSO READ :
Advertisement
బాలకృష్ణ నటించిన తొలి సినిమా బ్యాన్ అయిందని మీకు తెలుసా ? ఎందుకంటే..?
“ఆచార్య” సినిమాకి మొదట అనుకున్న కథ ఇదేనా ? ఇది తీసుకుంటే బ్లాక్ బస్టర్ పక్కా పడేది..!