సినిమాలపై ఉన్న ఆసక్తితో చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ సినిమాల్లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ తో పాటూ కటోర శ్రమ కూడా అవసరమే. నటన అంటే ఏమైనా బరువులు మోయడమా ఎందుకంత కష్టం అని చాలా మంది అనుకుంటారు. కానీ వందల మంది ముందు సిగ్గుపడకుండా నటించడం మామూలు విషయం కాదు. అంతే కాకుండా పగలనక రాత్రనకా షూటింగ్ లకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు సినిమాలు ఒకే సారి చేయాల్సి ఉంటుంది.
Advertisement
అలాంటి సమయంలో తినడానికి కూడా టైమ్ దొరకదు. కానీ అలాంటి కష్టాలన్నీ ఎదుర్కుని తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. సినిమాల్లోకి రావాలనుకున్న ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికీ సినిమాల పై ఆసక్తితో వస్తున్న చాలా మంది తమకు చిరు రోల్ మోడల్ అని చెబుతుంటారు. ఇదిలా ఉంటే చిరంజీవి తండ్రి కానిస్టేబుల్ అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ ఆయన కూడా ఓ నటుడు అన్న సంగతి మాత్రం అతికొద్దిమందికి మాత్రమే తెలుసు.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి దర్శుకుడు బాపు కాంబినేషన్ లో మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యమైన మంత్రి పాత్రను ఎవరితో వేయిస్తే భాగుంటుంది అనే సందేహంలో దర్శకుడు ఉన్నారు. ఆ సమయంలో చిరంజీవి మావయ్య అల్లు రామలింగయ్య మా భావగారు ఉన్నారు కదా…ఆయనతో వేయిద్దామా అంటూ సలహా ఇచ్చారు. అలా మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో మెగాస్టార్ తండ్రి వెంకట్రావు మంత్రిగా నటించారు.
ఈ సినిమా కంటే ముందే చిరు తండ్రి వెంకట్రావు 1969లో జగత్ జెట్టీలు అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా తరవాత ఆయనకు మరిన్ని ఆఫర్ లు వచ్చినా కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అలా సినిమాలపై నటన పై ప్రేమ ఉన్నా కూడా కుటుంబం కోసం తన ఇష్టాన్ని త్యాగం చేశారు. తన కొడుకు మెగాస్టార్ అయ్యాక ఒకటి రెండు సినిమాలు చేశారు.
ALSO READ:
సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..!