Home » మెగాస్టార్ ని తిట్టినందుకు.. సారీ చెప్పిన ఇంద్ర రైటర్…!

మెగాస్టార్ ని తిట్టినందుకు.. సారీ చెప్పిన ఇంద్ర రైటర్…!

by Sravya
Ad

ఇంద్ర వంటి సినిమాలతో స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిన్ని కృష్ణ. ప్రస్తుతం ఆయన సినిమాలకి కథలు రాయట్లేదు చివరగా జీనియస్ సినిమాకి కథ రాశారు అయితే 2019 ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద చిన్ని కృష్ణ విమర్శలు చేశారు. అవి అప్పట్లో సంచలనంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేసారు. మెగా ఫ్యామిలీ నుండి ఎవరు అతని విమర్శలపై రియాక్ట్ అవలేదు. వాటిని అందరూ మర్చిపోయారు తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయన విషెస్ చెప్పారు.

Advertisement

Advertisement

మెగాస్టార్ చిరంజీవి కోసం అందరూ కలిసి అభినందన సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రైటర్ చిన్నికృష్ణ కూడా మెగాస్టార్ చిరంజీవిని కలిసి విషెస్ చెప్పారు తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పారు. అటువంటి మాటలు నేను అనకూడదు అని క్షమాపణ చెప్పారు చిరంజీవిని తాజాగా నేను కలిసాను. ఆయనను ఆహ్వానించి ఆత్మీయంగా మాట్లాడాలని అన్నారు కథలు ఏమైనా రాస్తున్నారా కలిసి పని చేద్దామని చెప్పానని చిన్ని కృష్ణ అన్నారు. చిన్ని కృష్ణ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading