తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత 18 రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన జీవితాన్ని అనుభవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగినట్లు ఏపీ సిఐడి పోలీసులు బలమైన ఆధారాలు కోర్టుకు సమర్పించారు. ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడును రిమాండ్ కు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 5 వరకు చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. అక్టోబర్ 5వ తేదీ తర్వాత ఆయన రిమాండు మరికొన్ని రోజులు పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఏపీ సిఐడి పోలీసులు బలమైన ఆధారాలను రెడీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో… తెలుగుదేశం పార్టీ అధినేత మహా చంద్రబాబునాయుడు… ఈ కేసు నుంచి బయట పడాలంటే కేవలం రెండే రెండు మార్గాలు ఉన్నాయి.
Advertisement
Advertisement
కేవలం రెండు మార్గాల ద్వారానే చంద్రబాబు నాయుడును బయటకు తీసుకురావచ్చు అని న్యాయ నిపుణులు చెపుతున్నారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని… కోర్టులో బలమైన వాదనలు వినిపించాలి. ఏపీ సిఐడి పోలీసులు తెచ్చిన సాక్ష్యాలు అబద్ధమని నిరూపించగలగాలి. కానీ అది అసాధ్యమని తెలుస్తోంది. ఏపీ సిఐడి పోలీసుల చేతిలో బలమైన ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక మరో దారి ఏంటంటే… నారా చంద్రబాబు నాయుడు వయసును చూపి ఈ కేసు నుంచి తప్పించవచ్చు. చంద్రబాబు వయసు చూపి బెయిల్ దరఖాస్తు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు న్యాయ నిపుణులు. లేకపోతే ఈ కేసులో చంద్రబాబుకు కష్ట కాలం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా – కొడాలి నాని
- Babar Azam : ఇండియాకు కారులో వచ్చేసిన బాబర్.. పోలీసులు ఆపేశారుగా ?
- చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్..హైదరాబాద్ లో ర్యాలీలు తీస్తే తాట తీస్తాం !