తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు నాయుడు పేరును ఏపీ సిఐడి పోలీసులు చేర్చారు. ఈ మేరకు పకడ్బందీగా ఆధారాలను కోర్టుకు అందజేయడంతో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాడు.
గత మూడు వారాలుగా చంద్రబాబు నాయుడు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడును బయటికి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు నాన కష్టాలు పడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కోర్టులు కూడా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం లేదు. అటు తెలుగుదేశం పార్టీలో రెండవ నెంబర్ లీడర్ ఉన్న నారా లోకేష్ చుట్టూ అమరావతి రింగ్ రోడ్డు కేసు బిగిసుకుంటుంది. ఆ కేసులో నారా లోకేష్ ను ఎప్పుడైనా ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయవచ్చు. దీంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది.
ఏపీలో ఏ క్షణమైన ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే… ముందస్తుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త అలజడికి నెలకొంది. అసలు పార్టీని నడిపే నాయకుడు లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు నిర్ణయాలు అని తెలుస్తోంది. దాదాపు 40 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీలో రెండవ స్థాయి లీడర్ ను చంద్రబాబు నాయుడు తయారు చేయలేకపోయాడు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎవరిపై నమ్మకం పెట్టక… భయంతో ఎవరికీ కూడా పార్టీ బాధ్యతలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఇక బాలయ్యకు ఈ బాధ్యతలు అప్పగించినా… అతను సక్సెస్ కాలేడని చెబుతున్నారు. మొన్న అసెంబ్లీలో విజిల్స్ వేసి టిడిపి పరువు తీశాడు బాలయ్య. ఇక నారా లోకేష్ అరెస్ట్ అవుతే… నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పార్టీ బాధ్యతలు చేపట్టే పరిస్థితి నెలకొంది. ఇంత పెద్ద పార్టీని ఈ ఇద్దరు మహిళలు ముందుకు తీసుకువెళ్లడం చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- ఆ పని కోసం..శ్రియ ముఖానే చెక్ విసిరిన తెలుగు ప్రొడ్యూసర్..?
- చిరంజీవిని బ్లాక్ మెయిల్ చేసిన చరణ్…అలా చేస్తే నేను చచ్చిపోతానంటూ !!
- Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. ఈ సారైనా హిట్ కొడతారా ?