చంద్రమోహన్ గురించి పరిచయం చేయక్కర్లేదు. చాలా సినిమాలు చేసి చంద్రమోహన్ అందరిని అలరించారు. ఎంతోమంది కొత్త హీరోయిన్ల కి లక్కీ హీరోగా కూడా మారారు. హుద్రోగా సమస్యతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో 9:45 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం సినీ రంగానికి తీరని లోటు. ఇదిలా ఉంటే శ్రీదేవి గురించి కూడా పరిచయం చేయక్కర్లేదు. శ్రీదేవి చంద్రమోహన్ కలిసి నటించారు.
అందాల మల్లిగా శ్రీదేవి, అమాయకుడైన చంద్రంగా చంద్రమోహన్, పల్లెటూరు పోకిరిగా మోహన్ బాబు ఈ సినిమాలో కనపడ్డారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయినా కూడా చంద్రమోహన్ కి నచ్చలేదు. ఈ విషయాన్ని ఆయన డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తను హీరోగా వచ్చిన తొలి చిత్రం రంగులరాట్నం ఆ సినిమానే చంద్రమోహన్ కి చాలా ఇష్టమని చంద్రమోహన్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలానే కలికాలం, సగటు మనిషి వంటి సినిమాలు సంతృప్తిని ఇచ్చాయట. పదహారేళ్ళ వయసు సినిమా తన మనసుని తాకలేదుట.
Advertisement
Advertisement
అది రీమేక్ సినిమా. అందుకే కారణమని చంద్రమోహన్ చెప్పారు. భారతీయ రాజ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా మోహన్ బాబు విలన్ గా తమిళంలో సినిమా వచ్చింది. ఈ సినిమా చాలా బాగుందని ప్రొడ్యూసర్ భావించి ఎంతో కష్టపడి రీమేక్ హక్కులు కొనుగోలు చేశారు. ఈ సినిమాని చంద్రమోహన్ శ్రీదేవి మోహన్ బాబులతో తెరమీదకి తీసుకువచ్చారు ఇది కూడా బ్లాక్ బస్టర్ గానే నిలిచింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!