Home » నాన్న ఎప్పుడు మాకు ఇదే చెప్పేవాళ్ళు.. చంద్ర మోహన్ కూతురు ఎమోషనల్..!

నాన్న ఎప్పుడు మాకు ఇదే చెప్పేవాళ్ళు.. చంద్ర మోహన్ కూతురు ఎమోషనల్..!

by Sravya
Ad

చంద్రమోహన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు చంద్రమోహన్. చంద్రమోహన్ ఈనెల 11వ తేదీన తుది శ్వాస విడిచారు 13వ తేదీన అంతిమ సంస్కారాలను నిర్వహించారు. పలువురు సినీ మీడియా ప్రముఖులు కూడా హాజరయ్యారు. చంద్రమోహన్ కూతురు మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చంద్రమోహన్ పెద్ద కూతురు పేరు మధుర ఆమె మాట్లాడుతూ నాన్నగారు ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ మన బలం అని చెప్పేవారు ప్రపంచం ఏమన్నా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరూ నిన్ను ఆపలేరు అని చెప్పే వాళ్ళని మధుర చెప్పుకొచ్చారు.

Chandra Mohan

నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో నాన్న అని.. ఎప్పుడు మాతో ఉంటారు నాకు స్ఫూర్తిగా ఉంటారు.. నా దృష్టిలో ఆయన ఎప్పుడూ లివింగ్ లెజెండ్ అని మధుర మాట్లాడారు ఇది ఇలా ఉంటే చంద్రమోహన్ రెండో కూతురు మాధవి కూడా మాట్లాడారు. నాన్న కర్మయోగి ఆయన నిర్మాతల ఆర్టిస్ట్. ఆయన మనసులోని తలుచుకున్న వ్యక్తులు అందరూ మాతో ఉన్నట్లు మేము భావిస్తాం. మాకు ఎంతోమంది ఫోన్లు కూడా చేశారు.

Advertisement

Advertisement

ఆయన ప్రిన్సిపల్స్ కావడం ముఖ్యం జీవితంలో ఎలా బతకాలో నేర్పించారు నాన్న అని చిన్న కూతురు మాధవి చెప్పారు. ఇక్కడికి వచ్చిన సినిమా కుటుంబ సభ్యులందరికీ థాంక్స్ అని కూడా మాధవి చెప్పారు. అలానే చంద్రమోహన్ మనవరాలు చిన్మయి మాట్లాడుతూ మేము మద్రాస్ లో ఉండే వాళ్ళం. ఆరేడేళ్లు వచ్చే వరకు అంత పెద్ద నటుడు అని తెలియదని స్కూల్ కి వచ్చి నన్ను పికప్ చేసుకునే వారు సరదాగా ఆటలు ఆడేవారు అని చంద్రమోహన్ మనవరాలు చిన్న చిన్మయి మాట్లాడారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడాలి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading